బిజినెస్

వరుసగా నాలుగో రోజూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ నష్టాల పాలయ్యాయి. ఆర్థిక రంగంలో నెలకొన్న ఒడిదుడుకులు, అపరిష్కృతంగా సాగుతున్న వాణిజ్య యుద్ధాలు మరింత ముదరడం మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని విశే్లషకులు పేర్కొంటున్నారు. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ గురువారం పెద్దయెత్తున ఒడిదుడుకులకు గురైంది. ఇంట్రాడేలో ఓ దశలో 38,319.93 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 37,957.56 పాయింట్ల కనిష్టాన్ని ఈ సూచీ స్పృశించింది. చివరికి 198.54 పాయింట్ల (0.52శాతం) నష్టంతో సరిపెట్టుకుంది. ఇక బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 46.80 పాయింట్లు (0.41శాతం) నష్టంతో 11,313.10 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. ప్రధానంగా సెనె్సక్స్ ప్యాక్‌లో లోహ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో భారీగా నెలకొన్న వాటాల విక్రయ వత్తిడి వల్ల మొత్తం సూచీని నష్టాలు నమోదు చేసేలా చేసిందని విశే్లషకులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐరోపా ఉత్పత్తులపై సుంకాలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించడం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇది అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధికి విఘాతం కలిగిస్తుందన్న ఆందోళనను మదుపర్లు వ్యక్తం చేశారు. కాగా దేశీయ బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో వరుసగా చోటుచేసుకున్న అనూహ్య, అననుకూల పరిణామాలు ఇప్పటికే మదుపర్లను అయోమయ స్థితికి చేర్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో గత రెండు రోజుల నుంచి సెనె్సక్స్ చార్టులో నష్టాలను సంతరించుకుంటున్న వేదాంత తాజాగా గురువారం 4.66 శాతం భారీ నష్టాలపాలైంది. అలాగే టాటాస్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్ సైతం 3.36 శాతం అధిక నష్టాలను సంతరించుకున్నాయి. మరోవైపువరుసగా ఐదు రోజులపాటు నష్టాల పాలైన యస్‌బ్యాంకు గురువారం 33 శాతం లాభపడింది. తమ బ్యాంకు ఆర్థికంగా బలంగా ఉందని, ద్రవ్య లభ్యత బాగా ఉందని, రెగ్యులేటరీ అవసరాలను తమ బ్యాంకు త్వరలో అందుకుంటుందని యెస్ బ్యాంక్ అధికారులు భరోసా ఇవ్వడం సానుకూలంగా మారిందని విశే్లషకులు చెబుతున్నారు. అలాగే టాటా మోటార్స్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, ఎం అండ్ ఎం సైతం అత్యధికంగా 6.16 శాతం లాభపడ్డాయి. ఇలావుండగా అమెరికా ఐరోపా దేశాలతో కొత్త వాణిజ్య యుద్ధానికి తెరతీసిన నేపథ్యంలో ఆసియా మార్కెట్లు గురువారం నష్టాలను నమోదు చేశాయి.