బిజినెస్

దిగొస్తున్న ఉల్లి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: దేశంలో ఉల్లి ధరలు దిగొస్తున్నాయని కేంద్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించినందున రిటైల్ అలాగే హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు తగ్గడం మొదలైందని గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోనే కిలో అరవై నుంచి 70 రూపాయల వరకూ ధర పలికింది. అలాగే దేశంలోని పలు ప్రాంతాల్లోనూ 50 రూపాయలకు పైమాటే. అయితే వ్యాపారుల వద్ద నిల్వలపై పరిమితి విధించడం, ఎగుమతులపై ఆంక్షల నేపథ్యంలో నెమ్మదిగా ధర తగ్గుతోందని పాశ్వాన్ తెలిపారు.‘వ్యాపారులు అలాగే వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిటైలర్ల వద్ద వంద క్వింటాళ్ల కంటే ఎక్కువ సరుకు నిల్వ ఉండకూడదు. అలాగే హోల్‌సేల్ వ్యాపారుల వద్ద 500 క్వింటాళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తోంది’అని కేంద్ర మంత్రి చెప్పారు. ‘కేంద్రం వద్ద 25వేల టన్నుల ఉల్లి ఉంది. మీరొచ్చి తీసుకెళ్లవచ్చని రాష్ట్రాలను కోరాం. ఆ లెక్కన రూ. 23.90 పైసలకు కిలో ఉల్లి దొరుకుతుంది. ధర నిలకడగా ఉంటుంది‘అని పౌర సరఫరాల మంత్రి తెలిపారు. మహారాష్టల్రోని లాసాల్‌గావ్‌లో కిలో ఉల్లి ధర 30 రూపాయలకు లభిస్తోంది. లాసాల్‌గావ్ ఆసియాలోనే అతిపెద్ద ఉల్లిమార్కెట్. ఎగుమతులపై ఆంక్షలు, నిల్వలపై పరిమితి విధించడంతో ధర దిగివస్తోందని పాశ్వాన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ మధ్యకాలంలో అక్కడ కిలో 51 రూపాయల ధర పలికిందని నేషనల్ హార్టికల్చర్ రీసెర్చీ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ వెల్లడించింది. లాసాల్‌గావ్‌లో గురువారం గరిష్ట ధర 30 రూపాయలు, కనిష్ట ధర 15 రూపాయలని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ ప్రకటించింది. లాసాల్‌గావ్‌లో ధరే దేశ వ్యాప్తంగా మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆగస్టు నుంచి ఉల్లి ధర ఆకాశానంటింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటకలో వరదలు అతలాకుతలం చేశాయి. నవంబరం నుంచి దిగుబడి పెరిగితే సరుకు మార్కెట్‌ను ముంచెత్తుతాయని అప్పుడు ధరలు వాటంతట అవే దిగొస్తాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
*చిత్రం... కేంద్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్