బిజినెస్

ఏపీలో పెట్టుబడులకు ‘ఇంటెలిజెంట్’ సంసిద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 16: రాష్ట్రంలో పెట్టుబడులకు హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఇంటెలిజెంట్ ఎస్‌ఈజెడ్ లిమిటెడ్ ముందుకొచ్చింది. రెండు విడతలుగా రూ. 700 కోట్లతో ఫుట్ వేర్ యూనిట్లు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా సంస్థ ప్రతినిధులు బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో
ఫుట్‌వేర్ తయారీ కోసం ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్) ఏర్పాటుపై చర్చించారు. ఈ ఆర్థిక మండలి ఏర్పాటుకు రూ. 700 కోట్లు ఖర్చవుతుందని సుమారు పదివేల మందికి ఉపాధి కల్పన జరుగుతుందని సంస్థ ప్రతినిధులు వివరించారు. ప్రభుత్వం అనుమతిచ్చిన ఐదేళ్లలో రూ. 350 కోట్లు తొలివిడతగా ఖర్చు చేస్తామని ప్రకటించారు. విస్తరణ రూపంలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశారు. హాంకాంగ్‌కు చెందిన ఈ సంస్థ ప్రపంచ ప్రఖ్యాత ఆడిడాస్ బ్రాండ్ ఉత్పత్తుల్లో గుర్తింపు పొందింది. భారత్, చైనా, వియత్నాం దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రూ. 1750 కోట్ల పెట్టుబడితో యూనిట్లను నెలకొల్పి 25వేల మందికి ప్రధానంగా మహిళలకు ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టులో అపాచీ ఫుట్‌వేర్ సంస్థ ఎస్‌ఈజెడ్‌లో ఇంటెలిజెంట్ సంస్థ భాగస్వామిగా కొనసాగుతోంది. ఏపీలో 2006 నుంచి ఈ సంస్థ నెలకు 12 లక్షల జతలను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటి వరకు రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టి 11వేల మందికి ఉద్యోగాలు కల్పించామని కంపెనీ ప్రతినిథులు సీఎంకు వివరించారు. అదే విధంగా వియత్నాంలో కూడా ఏడాదికి 50లక్షల ఫుట్‌వేర్ ఉత్పత్తి జరుగుతోందని ఆ దేశంలో సుమారు 4 వేల మంది పనిచేస్తున్నారని తెలిపారు. సంస్థ ప్రతినిథులు టిమ్ కౌ టు మిన్‌సుయ్ త్సాయ్, యున్‌లీ, ముత్తు గోవింద స్వామి, ఏపీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

*చిత్రం... ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయిన ఇంటెలిజెంట్ ఎస్‌ఈజెడ్ ప్రతినిధులు