బిజినెస్

క్షీణించిన ఆయిల్ ఇండియా లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రభుత్వరంగ చమురు సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఒఐఎల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 33.47 శాతం క్షీణించింది. ఈసారి 494.41 కోట్ల రూపాయలుగా నమోదైతే, గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 743.21 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,460.85 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 3,164.12 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు మంగళవారం బిఎస్‌ఇకి సంస్థ తెలియజేసింది. క్రిందటిసారితో చూస్తే ముడి చమురు ఆదాయం 2,195.36 కోట్ల రూపాయల నుంచి 1,605.35 కోట్ల రూపాయలకు తగ్గింది.