బిజినెస్

భారత్‌తో 18 బిలియన్ డాలర్ల ‘రక్షణ వ్యాపారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక రక్షణ పరికరాల వ్యాపారం ఈ సంవత్సరాంతం నాటికి 18 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్టు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ తెలిపింది. భారత్- అమెరికా డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ (డీటీటీఐ) గ్రూప్ సమావేశం వచ్చే వారం ఢిల్లీలో జరుగనున్న నేపథ్యంలో పెంటగాన్ శనివారం ఈ విషయం తెలిపింది. భారత్‌తో తన భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి అమెరికా కట్టుబడి ఉందని డిఫెన్స్ ఫర్ అక్విజిషన్ అండ్ సస్టెయిన్‌మెంట్ అండర్‌సెక్రెటరి ఎలెన్ ఎం లార్డ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య సైనిక సంబంధాలను, సహకారాన్ని పెంచుకోనున్నట్టు ఆమె చెప్పారు. ‘2008లో సున్నాగా ఉన్న ద్వైపాక్షిక రక్షణ పరికరాల వ్యాపారం ఈ సంవత్సరం చివరి నాటికి 18 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేయడం జరిగింది’ అని ఆమె పెంటగాన్‌లో విలేఖరులకు చెప్పారు. భారత్- అమెరికా డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ గ్రూప్ సమావేశానికి డిఫెన్స్ ప్రొటెక్షన్ సెక్రెటరి అపూర్వ చంద్రతో కలిసి సహ అధ్యక్షత వహించడానికి లార్డ్ వచ్చే వారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ‘డీటీటీఐ గ్రూప్ సమావేశానికి అమెరికా రక్షణ శాఖ సిద్ధమవుతున్న తరుణంలో మా ప్రధాన రక్షణ భాగస్వామి భారత్‌తో కలిసి పనిచేసేందుకు నేను ఎంతో ఉత్తేజితురాలినయ్యాను’ అని లార్డ్ అన్నారు. అమెరికా గత ఆగస్టులో భారత్‌కు ‘స్ట్రాటజిక్ ట్రేడ్ అథారిటి టైర్ 1’ హోదాను ఇవ్వడంతో అమెరికన్ కంపెనీలు భారత్‌కు ద్వివిధ ఉపయోగిత, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఎగుమతి చేయడానికి వీలు కలిగిందని ఆమె తెలిపారు.