బిజినెస్

దివాళీ మార్కెట్‌లో చైనాకు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: దేశంలో ఏ పండగలు వచ్చినా భారత మార్కెట్‌ను ముంచెత్తే చైనా ఉత్పత్తుల అమ్మకాలు ఈసారి దీపావళి సందర్భంగా దారుణంగా పడిపోయాయి. వివిధ ప్రాంతాల్లో చైనా నుంచి దిగుమతి అయ్యే విగ్రహాలు కూడా పెద్ద సంఖ్యలో అమ్ముడయ్యేవి. గణేషుడు, లక్ష్మి, దుర్గా, సరస్వతి, శివ తదితర దేవతామూర్తుల విగ్రహాలు చైనా నుంచే దిగుమతి అయ్యేవి. మార్కెట్‌లో ఒకప్పుడు సుమారు 80 శాతం వరకు ఈ ఉత్పత్తులే కనిపించేవి. ఆరేళ్ల క్రితం అత్యధికంగా ఉన్న చైనా విగ్రహాల అమ్మకం క్రమంగా పడిపోతూ వస్తోంది. ‘మేడిన్ చైనా’ స్థానంలోనే ‘మేడిన్ ఇండియా’ నినాదం బలంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవడంతో చైనా ఉత్పత్తుల గిరాకీ తగ్గుతూ వచ్చింది. ఈసారి మార్కెట్‌లో చైనా నుంచి దిగుమతి అయిన దేవతామూర్తుల విగ్రహాల అమ్మకాలు 10 శాతం కూడా లేవని తాజా మార్కెట్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విగ్రహాలను తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానం ఒకప్పుడు చైనాలో మాత్రమే అందుబాటులో ఉండడంతో అక్కడ నుంచి దిగుమతి అయిన విగ్రహాలు మాత్రమే మార్కెట్‌లో కనిపించేవి. స్వదేశీ పరిజ్ఞానంతో విగ్రహాలు తయారు చేయడం ఎక్కువ శ్రమతో కూడుకున్నది కావడంతో వాటి ధర ఎక్కువగా ఉండేది. ఫలితంగా మార్కెట్‌లో చైనా విగ్రహాలు 80 శాతం అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు ఈ పరిజ్ఞానం దేశంలోనే అందుబాటులోకి వచ్చింది కాబట్టి, ధరల్లో చెప్పుకోదగ్గ తేడాలు లేవని అఖిల భారత వాణిజ్యవేత్తల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ స్పష్టం చేశారు.