బిజినెస్

5 శాతం లాభపడిన టోరెంట్ ఫార్మా వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: టోరెంట్ పార్మాస్యూటికల్స్ వాటాలు గురువారం 5 శాతం లాభపడ్డాయి. ఈకంపెనీ తాజా త్రైమాసిక ఫలితాల్లో 36.3 శాతం అదనపునికర లాభాన్ని నమోదు చేయడమే ఇం దుకు కారణం. సెప్టెంబర్‌తో ముగిసిన తాజా త్రైమాసిక సానుకూల ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ కంపెనీ వాటా 5.13 శాతం లాభపడి రూ. 1,766.95గా ట్రేడైంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 5.22 శా తం లాభపడి రూ. 1,768గా ట్రేడైంది. ఈ మూడు నెలల్లో మొత్తం నికర లాభం 36.31 శాతం వృద్ధితో రూ. 244 కోట్లు సమకూరిందని ఆ కంపెనీ వివరించింది. తమ ఉత్పత్తులకు మార్కెట్లో పెరిగిన డిమాండ్ కారణంగానే ఇది సాధ్యమైందని ఆ కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే కాలంలో ఈ సంస్థకు రూ. 179 కోట్ల నికర లాభం సమకూరింది. నిర్వహణ (ఆపరేషన్స్) విభాగం ఆదాయం రూ. 2,005 కోట్లని, గతేడాది ఈ కాలంలో రూ. 1,894 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించింది.