బిజినెస్

‘ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్’కు రూ.1,062 కోట్ల త్రైమాసిక నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ప్రైవేటు విమానయాన దిగ్గజం ఇండిగో మాతృ సంస్థ ‘ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్’ గురువారం త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గత సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మొత్తం రూ. 1,062 కోట్లమేర తమ సంస్థకు నష్టాలు వచ్చినట్టు ఆ సంస్థ తెలిపింది. ధరల పెరుగుదలతోబాటు ‘మార్కెట్ టు మార్కెట్’ ప్రాతిపదికన వచ్చిన నష్టాలే తమ సంస్థను మొత్తంగా నష్టాల్లోకి నెట్టాయని ఆ సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంస్థ రూ. 651.5 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అన్ని రకాల పన్ను చెల్లింపుల అనంతరం ఈ నష్టాలను ప్రకటించామని తెలిపింది. కాగా తాజా రెండోత్రైమాసికంలో ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్‌కు మొత్తం ఆదాయం 31 శాతం వృద్ధితో రూ. 8,539.8 కోట్లు సమకూరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 6,514 కోట్ల ఆదాయం సమకూరిందని సంస్థ తెలిపింది. కాగా ప్రాధాన్యత కలిగిన ఆపరేటింగ్ లీజుల్లో మార్కెట్ టు మార్కెట్ ప్రాతిపదికన రూ. 4,282 మిలియన్ల మేర, పెరిగిన ధరలు, నిర్వహణ ఖర్చుల వల్ల రూ. 3,190 మిలియన్ల మేర నష్టం వాటిల్లడం వల్ల స్థూలంగా సంస్థకు నష్టాలే మిగిలాయని ఆ సంస్థ వివరించింది.