బిజినెస్

ప్రైవేటు ఈక్విటీల్లోకి ఆల్‌టైం రికార్డు స్థాయి పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఓవైపు అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అస్థిరతలున్నా గత సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలోప్రైవేటు ఈక్విటీ నిధులు ఆల్‌టైం రికార్డు స్థాయిలో సమకూరాయి. మొత్తం 9.4 బిలియన్ డాలర్ల నిధులు ఈ మూడు నెలల కాలంలో పెట్టుబడులుగా వచ్చాయి. ప్రధాన కార్పొరేట్ కంపెనీల్లోకే అధికంగా పెట్టుబడులు వచ్చాయి. ప్రైవేటు ఈక్విటీలపై ‘గ్రాంట్ ధార్న్‌టన్’ త్రైమాసిక అధ్యయన నివేదిక ఈమేరకు గురువారం నాడిక్కడ విడుదలైంది. గడచిన జూలై నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 211 ప్రైవేటు ఈక్విటీలు (పీఈలు) 9,613 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత ఏడాది ఇదే కాలంలో మొత్తం 16 ప్రైవేటు ఈక్విటీల ద్వారా 5,202 మిలియన్ డాలర్ల లావాదేవీలు మాత్రమే జరిగాయని ఆ నివేదిక తెలిపింది. ఓవైపుఆర్థిక అస్థిరతలున్నా పీఈ పెట్టుబడులు ఆల్‌టైం రికార్డు స్థాయి 9.4 బిలియన్ డాలర్ల మేర సమకూరడం ఆసక్తికర అంశమని తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో 7.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని గ్రాంట్ థార్న్‌టన్ ఇండియా ఎల్‌ఎల్ డైరెక్టర్ పంకజ్ చోప్రా తెలిపారు. పెద్దకంపెనీలే ఈ పెట్టుబడులు రాబట్టే విషయంలో పైచేయిని సాథించాయని, 21 అత్యున్నత విలువ పెట్టుబడుల్లో 100 మిలియన్ డాలర్లు అంతకన్నా అధికంగా నిధులు సమకూరాయని ఆయన వివరించారు. ఇది మొత్తం ప్రైవేటు ఈక్విటీల పెట్టుబడుల్లో 79 శాతమని ఆయన చెప్పారు. కాగా జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రైవేటు ఈక్విటీల్లో పెట్టుబడుల విలువ 1.6 రెట్లు పెరిగిందని నివేదిక తెలిపింది. ఓవైపు ఒప్పంద విలువ నాలుగు శాతం తగ్గినా పెట్టుబడుల విలువ పెరగడం విశేషమని నివేదిక తెలిపింది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో 595 ప్రైవేటు ఈక్విటీలు మొత్తం 24,302 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 622 పీఈలు కేవలం 14,961 మిలియన్ డాలర్ల మాత్రమే కుదుర్చుకున్నాయి. మదుపర్లలో పెరిగిన ఆత్మవిశ్వాసంతోబాటు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల్లో కోత విధించడం, మరిన్ని ఉద్దీపన చర్యలు చేపడతామని ప్రకటించడం దేశీయ ఈక్విటీ మార్కెట్లకు భవిష్యత్తులో కూడా భారీగా పెట్టుబడులు సమకూరే అవకాశాలున్నాయని నివేదిక అంచనా వేసింది. కాగా అధ్యయనంలో అంకుర సంస్థలు, ఈ-కామర్స్ సంస్థలు, ఐటీ, ఐటీఈఎస్, బీఎస్‌ఎఫ్‌ఐ, పార్మా రంగాల పీఈ డీల్ వాల్యూమ్‌ను పరిగణలోకి తీసుకోవడం జరిగిందని చోప్రా తెలిపారు.