బిజినెస్

స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్పంగా నష్టపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు రావడంతోబాటు ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్న ఉన్నతాధికారుల కారణంగా ఇన్ఫోసిస్ తాజా రెండు శాతం నష్టపోవడం స్టాక్ మార్కెట్లకు ప్రతికూలం మారింది. ఈక్రమంలో ఐటీ, బ్యాంక్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఉదయం నుంచే ఊగిసలాటకు గురైన బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఓ దశలో ఏకంగా 486 పాయింట్లు నష్టాల్లోకి జారింది. అయితే తర్వాత కోలుకుని 38.44 పాయింట్ల (0.10 శాతం) నష్టంతో 39,020.39 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 38,840.76 పాయింట్ల కనిష్టాన్ని, 39,327.60 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 21.50 పాయింట్లు (0.19 శాతం) కోల్పోయి 11,582.60 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో యెస్‌బ్యాంక్, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 5.76 శాతం నష్టపోయాయి.
2.36 శాతం నష్టపోయిన ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్‌లో ఇద్దరు ఉన్నతాధికారులు అనైతిక చర్యలకు పాల్పడ్డారంటూ విజిల్‌బ్లోయర్స్ పేరిట ఫిర్యాదులు (లేఖలు) అందడంతో దీనిపై నిజనిర్థారణకు సెబీతోబాటు, అమెరికన్ సెక్యూరిటీస్ అం డ్ ఎక్చేంజ్ కమిషన్ విచారణ చేపట్టాయి. ఈక్రమంలో ఇన్ఫోసిస్ వాటాలు గురువారం మరో 2.36 శాతం నష్టపోయాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ ఆర్థిక నివేదిక సంస్థ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ)ను ఇన్ఫోసిస్ లుకలులపై, ఆరోపణలపై పరిశీలన జరపాల్సిందిగా ఆదేశించడం ఆ కంపెనీ షేర్ల పతనానికి మరో కారణమైంది. కాగా మరోవైపు సెనె్సక్స్ ప్యాక్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఆర్‌ఐఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఏసియన్ పెయింట్స్, టాటాస్టీల్, టాటామోటార్స్ 3.31 శాతం లానపడ్డాయి. ఇలావుండగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు దాదాపుగా హంగ్‌ను తలపించేలా వచ్చాయి. అటు బీజేపీకిగానీ, ఇటు కాంగ్రెస్‌కుగానీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడం మదుపర్లను ఆచితూచి అడుగేసేలా చేసిందని విశే్లషకులు పేర్కొన్నారు.
లాభాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు గురువారం సానుకూలంగానే ముగిశాయి. హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాల్లో, షాంఘై నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్ల ఆరంభ ట్రేడింగ్‌లో లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 11 పైసలు తగ్గి 71గా ట్రేడైంది. ముడిచమురు ధరలు 0.47 శాతం తగ్గి బ్యారెల్ 60.88 డాలర్ల వంతున ట్రేడైంది.