బిజినెస్

సెబీ, ఎస్‌ఈసీ విచారణకు సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్‌లో ఇద్దరు అత్యున్నతాధికారులపై వచ్చిన ‘విజిల్‌బ్లోయర్స్’ పేరిట వచ్చిన లేఖలోని ఆరోపణలపై స్టాక్ ఎక్చేంజ్ సంధించిన ప్రశ్నలపై ఆ సంస్థ గురువారం స్పందించింది. ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ)తో తమ కంపెనీ ఈ వ్యవహారంపై సంప్రదింపులు జరుపుతోందని, విచారణకు సంబంధించిన అన్ని అంశాల్లో తమ కంపెనీ ఎస్‌ఈసీకి పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఆ కంపెనీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. తమ కంపెనీ నుంచి కొంత అదనపు సమాచారాన్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సైతం కోరిందని దాన్నికూడా అందజేస్తామని తెలిపింది. కాగా సెబీతోబాటు ఎస్‌ఈసీ ఇన్ఫోసిస్ వ్యవహారంపై విచారణ చేపట్టడంతో మదుపర్లు మళ్లీ లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఆ కంపెనీ వాటాలు గురువారం 2.36 శాతం నష్టపోయి బీఎస్‌ఈలో ఒక్కో వాటా రూ. 635.40గా ట్రేడైంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 2.39 శాతం నష్టంతో ఒక్కో వాటా రూ. 632.05గాట్రేడైంది. ఇంట్రాడేలో ఈ వాటాలు బీఎస్‌ఈలో ఓ దశలో 2.39 శాతం నష్టపోయి ఒక్కోవాటా విలువ రూ. 632.05కు చేరింది. ఐతే తర్వాత స్వల్పంగా కోలుకోవడం జరిగింది. ఇక ఈ కంపెనీకి సంబంధించి బీఎస్‌ఈలో 17.26 లక్షల వాటాల లావాదేవీలు జరగ్గా, ఎన్‌ఎస్‌ఈలో 2.5 కోట్ల వాటాలు ట్రేడయ్యాయి.