బిజినెస్

6.6 శాతం నష్టపోయిన ఆభరణాల స్టాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ధన్‌తేరస్ పర్వదినాన దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆభరణాల స్టాక్స్ 6.6 శాతం నష్టపోయాయి. అనూహ్యంగా మదుపర్లు వాటాల విక్రయాలకు, లాభాల స్వీకరణకు పాల్పడడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో బీఎస్‌ఈలో ‘త్రిభువన్ దాస్ భీజీ జవేరీ’ వాటాలు 6.65 శాతం నష్టపోయాయి.
అలాగే ‘తంగ మయిల్ జువలరీ’ 4.81 శాతం నష్టాలను సంతరించుకుంది. ఇక ‘టైటాన్’ కంపెనీ 2.94 శాతం నష్టపోయాయి. బంగారం, వెండి కొనుగోళ్లకు సెంటిమెంటుగా ప్రత్యేక దినమైన ధన్‌తేరస్ రోజున ఈ రెండు విలువైన లోహాల వాటాలు నష్టపోవడం చర్చనీయాంశమైంది. జూలై నుంచి బంగారం రేట్లు పెరుగుతుండడం వల్లే ఇలా డిమాండ్ తగ్గిందని టైటాన్ జువలరీ రీటెయిల్ అండ్ మార్కెటింగ్ విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు సందీప్ కుల్‌హల్లీ తెలిపారు. అలాగే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వినియోగదారుడి వ్యయ సామర్థ్య శాతం కూడా పడిపోవడం మరో కారణమన్నారు. అయితే గడచిన కొన్ని రోజుల నుంచి బంగారం వ్యాపారంలో వృద్ధి కనిపిస్తోందన్నారు. ప్రపంచంలోకెల్లా మన దేశంలోనే అత్యధికంగా బంగారం వినియోగం, దిగుమతులు జరుగుతున్న సంగతి తెలిసిందే.