బిజినెస్

తాజా త్రైమాసికంలో.. ఎస్‌బీఐకి ఆరు రెట్ల అదనపు లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 25: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ తాజా త్రైమాసికంలో ఆరురెట్ల అదనపు లాభాలను నమోదు చేసింది. అనుబంధ సంస్థలో వాటాల విక్రయాల ద్వారా సమకూరిన భారీ లాభాలు, గణనీయంగా పెరిగిన ఆస్తుల విలువలే ఇందుకు దోహదం చేశాయి. ఈమేరకు త్రైమాసిక ఫలితాల నివేదికను ఆ బ్యాంకు శుక్రవారం నాడిక్కడ విడుదల చేసింది. గడచిన సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం రూ. 3,375 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు ఆ బ్యాంకు నివేదించింది. విధాన పరమైన రుణాల పంపిణీ, డిపాజిట్ల సేకరణ సైతం 212శాతం వృద్ధితో రూ. 3,011 కోట్ల వాణి జ్యం జరిగింది. ఒక వైపుఆర్ధికాభివృద్ధిలో మందగమనం, కొన్ని కార్పొరేట్ సంస్థలు మాత్రమే వర్కిం గ్ కేపిటల్ స్థాయికి సంతృప్తికర ఫలితాలు సాధిస్తున్న తరుణంలోనూ ఈ బ్యాంకు ఆరురెట్ల లాభాలను సాధించడం విశేషం. రుణాల వృద్ధిని 9 శాతం మించకుండా చూడడంలో కూడా ఈ బ్యాంకు విజయవంతమైంది. అలాగే రీటెయిల్ రుణాల పంపిణీపైనే ఈ బ్యాంకు ప్రధాన దృష్టి నిలిపింది. ఈ రుణా ల పంపిణీ 19 నుంచి 60 శాతానికి పెరిగిందని బ్యాంకు చైర్మన్ రజనీష్‌కుమార్ ఈ సందర్భంగా విలేఖరులకు తెలిపారు. అన్ని పరిస్థితులూ కలిసివస్తే కార్పొరేట్ రుణ పద్దుల్లో తమ బ్యాంకు వాటా కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు. నిరర్థక ఆస్తులు 7.19 శాతానికి తగ్గి మొత్తం 22.48 లక్షల కోట్లకు చేరిందన్నారు. గతేడాది ఇదే కాలంలో ఈ ఆస్తుల శాతం 9.95గా ఉండేదని తెలిపారు. రుణాల మాఫీ కారణంగా గతంలో ఏర్పడిన రూ. 16వేల కోట్ల భారం ఇప్పుడు రూ. 8వేల కోట్లకు తగ్గిందన్నారు. ఈక్రమంలో మొత్తం నష్టాలను నికరంగా 2శాతానికి మించకుండా చేయగలిగామన్నారు. తమ అనుబంధ సంస్ధ ఎస్‌బీఐ లైఫ్ వాటాల విక్రయం ద్వారా రూ.3,500 కోట్ల లాభాన్ని సమీకరించామన్నారు. ఈ నిధులను విద్యుత్ పద్దుల పునర్వ్యవస్థీకరణ కోసం రూ. 2,600 కోట్లు, తనఖాల్లో మంచిపేరు తెచ్చుకునేందుకు జరిగిన కృషిలో వాటిల్లిన నష్టం భర్తీ చేసేందుకు మరో రూ.900 కోట్లు వినియోగిస్తామని రజనీష్‌కుమార్ వివరించారు.