బిజినెస్

పసిడి ధరలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ధన్‌తేరస్ పర్వదినం పసిడి ధరలకు రెక్కలు తొడిగింది. దీంతో శుక్రవారం దేశ రాజధానిలో 10 గ్రాముల (తులం) బంగారంపై రూ. 220 పెరిగి మొత్తం ధర రూ. 39,240కి చేరింది. ధన్‌తేరస్ నుంచి వరసగా మూడు రోజులపాటు దేశ, విదేశాల్లోని భారతీయులు దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో సెంటిమెంటు నేపథ్యంలో వెండి, బంగారాలకు మూడు రోజులు మరింతగా డిమాండ్ నెలకొనడం రివాజుగా మారింది. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ. 39,020 పలికింది. కాగా వెండి ధర సైతం శుక్రవారం కిలోపై రూ. 670 పెరిగింది. మొత్తం ధర రూ. 47,680కి చేరింది. గురువారం ఈ ధర రూ. 47,010గా ఉంది. అలాగే తాజాగా 24 కేరట్ల స్పాట్‌గోల్డ్ ధర సైతం రూ. 220 పెరిగింది. కాగా స్పాట్ గోల్డ్ ధరలు ఈ పండుగ సీజన్‌లో మరింతగా పెరిగే అవకాశాలున్నాయని, అలాగే తదుపరి రానున్న పెళ్లిళ్ల సీజన్‌లో వెండి, బంగారు ఆభరణాలకు మరింతగా డిమాండ్ పెరుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన సీనియర్ విశే్లషకుడు తపన్‌పటేల్ పేర్కొన్నారు. కాగా అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో ఔన్స్ 1,506 డాలర్ల వంతున ట్రేడైంది. అలాగే వెండి ధర సైతం ఔన్స్ 18.05 డాలర్ల వంతున ట్రేడైంది. ఒక వైపు అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ ఇలా వెండి, బంగారం వాణిజ్యం మాత్రం లాభసాటిగా ఉండటం పట్ల వాణిజ్య వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.