బిజినెస్

స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వాణిజ్య వారం చివరి రోజైన శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వాటాలు కొందామా వద్దా అన్న సంశయం రోజంతా మదుపర్లలో కనిపించింది. కేవలం బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లకే వారు పరిమితం కావడం జరిగింది. ఈక్రమంలో బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ తొలుత ఏకంగా 532 పాయింట్లు ఎగబాకి ఊపుమీదున్నట్టు కనిపించింది. ఐతే మధ్యాహ్నం తర్వాత రెండు సూచీలు నేల చూపులు చూశాయి. చివరికి సెనె్సక్స్ 37.67 పాయింట్ల (0.10శాతం) స్వల్ప ఆధిక్యతతో 39,058.06 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇక బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ మరీ స్వల్పంగా కేవలం 1.30 పాయింట్లు (0.01శాతం) లాభపడి 11,583.90 పాయింట్ల గరిష్టంలో స్థిరపడింది. ఈ రెండు సూచీలు హిందూ కేలండర్ ఇయర్ ‘సంవత్ 2075’ను మంచి లాభాలతోనే ముగించాయి. కాగా శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో యెస్ బ్యాంకు అత్యధికంగా లాభపడగా, ఎస్‌బీఐ 7.19 శాతం లాభపడి రెండో స్థానంలో నిలిచింది. తాజాత్రైమాసికంలో ఈ బ్యాంకు దాదాపు 6 రెట్లు అదనంగా లాభాలను నమోదు చేయడంతో స్టాక్ మార్కెట్లో ఆ బ్యాంకు వాటాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు, సన్‌పార్మా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, మారుతి, భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ సైతం 3.18 శాతం లాభపడ్డాయి. మరోవైపు టాటామోటార్స్, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్, హీరోమోటోకార్ప్, ఎన్‌టీపీసీ అత్యధికంగా 4.87 శాతం నష్టపోయాయి. కాగా కార్పొరేట్ కంపెనీల ఫలితాల సీజన్ నడుస్తుండటంతో మదుపర్లు వేచిచూసే దోరణిని అనుసరిస్తున్నారని, ఈక్రమంలో రాబోయే రోజుల్లో 11వేల నుంచి 11,700 పాయింట్ల బ్రాడ్ రేంజ్ వరకు మార్కెట్లలో ట్రేడింగ్ జరిగే అవకాశాలున్నాయని వాణిజ్య విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఫలితాల ప్రభావం వ్యక్తిగత స్టాక్స్ పైనేగాక, వాహన, స్థిరాస్తి, ప్రధాన ప్రైవేటు బ్యాంకులపై సానుకూల ప్రభావం చూపే అవకాశాలున్నాయంటున్నారు. మిగిలిన మార్కెట్లలో సైతం ఈ త్రైమాసికం నుంచే విక్రయాలు బాగా కోలుకోవడం జరుగుతుందంటున్నారు. ఇక రంగాల వారీగా చూస్తే శుక్రవారం బీఎస్‌ఈలో బ్యాంకెక్స్, ఐటీ, టెక్, స్థిరాస్తి, చమురు, సహజవాయువులు, ఫైనాన్స్, హెల్త్‌కేర్ సూచీలు 1.07 శాతం లాభపడ్డాయి. మరోవైపు వినిమయ వస్తువులు, టెలికాం, పారిశ్రామిక, విద్యుత్, కేపిటల్ గూడ్స్ 1.78 శాతం నష్టపోయాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్ సూచీ లాభనష్టాల్లేని స్తబ్ధతను నమోదు చేయగా, స్మాల్‌క్యాప్ సూచీ 0.39 శాతం నష్టపోయింది.
మిశ్రమంగా అంతర్జాతీయ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్ సూచీలు శుక్రవారం మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. కార్పొరేట్ కంపెనీల ఫలితాలు మిశ్రమంగా ఉండటం, బ్రెగ్జిట్ డీల్‌లో మళ్లీ సరికొత్త అనిశ్చితి నెలకొనడం ప్రతికూలంగా మారాయి. కాగా ఆసియాలో షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు మిశ్రమ ఫలితాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలను నమోదు చేశాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తాజాగా 12పైసలు లాభపడి ఇంట్రాడేలో 70.90గా ట్రేడైంది. ఇక ముడిచమురు ధరలు 0.18 శాతం తగ్గి బ్యారెల్ 61.56 డాలర్ల వంతున ట్రేడైంది.