బిజినెస్

విజయవాడ, కర్నూలు, ఖమ్మంలో ఇపిఎఫ్‌ఓ కార్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: విజయవాడ, కర్నూలు, ఖమ్మం పట్టణాల్లో ఇపిఎఫ్‌ఓ డివిజన్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్టు కేంద్ర కార్మిక శాఖా సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. గురువారం నాడు ఆయన ఇఎస్‌ఐసి కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, విశ్వకర్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని శ్రామిక వర్గంలో చైతన్యాన్ని పెంపొందించేందుకు కనీస వేతనం, ప్రసూతి ప్రయోజనాల సవరణ, బోనస్‌లో సవరణ , బోనస్ అర్హత పరిమితిలో పెరుగుదల అంశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 17న కార్మిక మంత్రిత్వశాఖ విశ్వకర్మ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. హస్తకళల కార్మికులతో పాటు దేశవ్యాప్తంగా టూల్‌మెన్, కార్మికులు, పారిశ్రామికవేత్తలు పోషిస్తున్న పాత్రను గుర్తుచేసుకోవడానికి కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 16వ తేదీన అత్యుత్తమ శ్రామికులకు పారిశ్రామికవేత్తలకు అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఆశాకార్యకర్తలు, అంగన్‌వాడీ , మధ్యాహ్న భోజన శ్రామికులకు ఆరోగ్యం, బీమా , పెన్షన్ పథకాలను అమలుచేస్తోందని అన్నారు. ఇందుకోసం వివిధ మంత్రిత్వశాఖలతో ఒక కమిటీని వేశామని, కమిటీ సిఫార్సుల ఆధారంగా సామాజిక భద్రతా పథకాన్ని అమలుచేస్తామని పేర్కొన్నారు. ప్రసూతి ప్రయోజనాల చట్టంలో మార్పులు తెస్తూ మాతృత్వపు సెలవును 12 వారాల నుండి 26 వారాలకు పెంచామని అన్నారు. అలాగే బోనస్ చట్టంలో సవరణలు చేశామని, బోనస్ అర్హత పరిమితిని 10వేల నుండి 21వేలకు పెంచామని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల 56 లక్షల మంది కార్మికులకు మేలు చేస్తుందని అన్నారు. ఇఎస్‌ఐ రక్షణను 21వేలకు పెంచామని, 25వేల వేతనం ఉన్న వారు కూడా తమ ఆప్షన్ ఇవ్వవచ్చని చెప్పారు. సి కేటగిరిలో నైపుణ్యం లేని శ్రామికుల కనీస వేతనాన్ని 10,500కు పెంచామని గుర్తు చేశారు.