బిజినెస్

కృత్రిమ మేధో సంవత్సరంగా 2020

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: వచ్చే ఏడాది (2020)ని కృత్రిమ మేధో (ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్) సంవత్సరంగా పాటిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంతో కృత్రిమ మేధో రంగంలో పనిచేసేందుకు నాస్కామ్ ముందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఏడాది పొడువున పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. టెక్నాలజీ, ఐటీ రంగంలో వచ్చే మార్పుల్లో ఎప్పటికప్పుడు భాగమవుతూ అవకాశాలను అందుకుంటూ అగ్రభాగాన ఉన్న తెలంగాణ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. వ్యవసాయ రంగం, పట్టణ రవాణా, వైద్య, ఆరోగ్య రంగంలో కృత్రిమ మేథ ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నారు. శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను నాస్కామ్ అధ్యక్షురాలు దేబ్‌జానీ ఘోష్ ఇక్కడ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది కృత్రిమ
మేథో సంవత్సరంగా పాటిస్తే నాస్కామ్ పలు కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆమె చెప్పారు. దీనికి కేటీఆర్ అంగీకరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆయా కంపెనీలు తమ ఆర్ అండ్ డీ , టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్లను ఇక్కడ ప్రారంభిస్తున్నాయన్నారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి రంగాల్లో వివిధ కంపెనీలను ఇక్కడికి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పారు. డాటాసైన్స్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వంతో నాస్కామ్ భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి, డైరెక్టర్ డిజిటల్ మీడియా దిలీప్ కొణతం పాల్గొన్నారు.