బిజినెస్

విశాఖ టూ సింగపూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ నుంచి సింగపూర్‌కు విమాన సేవలందించేందుకు స్కూట్ ఎయిర్‌లైన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం విశాఖ నుంచి సింగపూర్‌కు సిల్క్ ఎయిర్ లైన్స్ వారంలో మూడు రోజుల పాటు సర్వీసులు నడుపుతోంది. దీని స్థానంలో స్కూట్ ఎయిర్‌లైన్స్ వారానికి అయిదు రోజుల పాటు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఆది, సోమ, బుధ, గురు, శుక్ర వారాల్లో ఈ విమానం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. సిల్క్ ఎయిర్ లైన్స్‌తో పోలిస్తే స్కూట్ ఎయిర్ లైన్స్‌లో 30 సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయి. ఈ సర్వీసు ద్వారా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది. ప్రపంచంలోని 160 గమ్యస్థానాలకు విశాఖ నుంచి బోర్డింగ్ పాస్‌లు జారీ చేసేలా స్కూట్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. చైనా, జపాన్, కొరియా, తైవాన్, మలేషియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్‌ఏ తదితర దేశాలకు నేరుగా బోర్డింగ్ పాస్‌లు జారీ చేస్తారు. ఇదిలా ఉండగా దేశీయంగా మరో రెండు సర్వీసులు విశాఖ నుంచి అందుబాటులోకి రానున్నాయి. విశాఖ నుంచి చెన్నై, విజయవాడ ప్రాంతాలకు కొత్త సర్వీసులు ప్రారంభించనున్నారు. విశాఖ నుంచి స్పైస్ జెట్ ఈ సర్వీసులు నడపనుంది. విశాఖ-చెన్నై సర్వీసు ఉదయం 8.30కి బయలుదేరి 11.20కి చెన్నై చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.35 గంటలకు చెన్నైలో బయలుదేరి 9.50కి విశాఖ చేరుకుంటుంది.