బిజినెస్

19 శాతం పెరిగిన పీఈ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 19 శాతం పెరిగాయి. వాణిజ్యపరమైన ఆస్తుల రంగం అత్యధికంగా లాభపడిం ది. మొత్తం మీద పీఈ పెట్టుబడులు ఇప్పుడు 3.8 బిలియన్ డాలర్లకు (సుమా రు రూ.2,691.92 కోట్లు) చేరాయి. అనరోక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత ఏడాది మొత్తం మీద పీఈ పెట్టుబడులు 3.2 బిలియన్ డాలర్లుకాగా, ఈ ఏడాది సెప్టెంబర్ మాసాంతానికే 3.8 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం విశేషం. మొదటి త్రైమాసికంలో వాణిజ్య, రియల్ ఎస్టేట్ రంగంలో మూడు బిలియన్ డాలర్ల వరకూ పీఈ పెట్టుబడులున్నాయి. గత ఏడాది ఇదే కాలానికి 2.1 బిలియన్ డాలర్లు మాత్రమే పీఈ పెట్టుబడుల రూపంలో సమకూరాయి. నివాస గృహాలు, ఇతర రెసిడెన్షియల్ సెగ్మెంట్‌లో ఈ ఏడాది 295 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తే, గత ఏడాది అది 210 మిలియన్ డాలర్లు. రీటైల్ రంగంలో 260 మిలియన్ డాలర్లు, లాగిస్టిక్స్‌లో 200 మిలియన్ డాలర్లు చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ముంబయి మెట్రోపాలిటిన్ రీజన్ (ఎంఎంఆర్)లో అత్యధికంగా 1.59 బిలియన్ డాలర్ల ఇన్‌ఫ్లో నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది మూడు శాతం ఎక్కువ. బెంగళూరులో పెట్టుబడులు 17 శాతం పెరిగి 420 మిలియన్ డాలర్లకు చే రగా, హైదరాబాద్‌లో మాత్రం ఏకంగా 76 శాతం పతనం కనిపించింది. గత ఏ డాది 790 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రియాల్టీ రంగంలో పీఈ ద్వారా హైదరాబాద్‌కు వస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ వచ్చిన మొత్తం 190 మిలియన్లు మాత్ర మే. చెన్నైలో గత ఏడాది 160 మిలియన్ డాలర్లుగా ఉన్న పెట్టుబడులు ఇప్పుడు 230 మిలియన్ డాలర్లకు చేరాయి.