బిజినెస్

లాభపడిన టీసీఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 26: ఈవారం స్టాక్ మార్కెట్‌లో, దేశంలోని పది టాప్ సంస్థల విలువ భారీగా పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యధికంగా లాభపడింది. భారత స్టాక్ మార్కెట్‌లో ఈవారం జరిగిన లావాదేవీలను పరిశీలిస్తే, 3టాప్-102 సంస్థల విలువ 76,998 కోట్ల రూపాయలు పెరిగింది. ఇందులో టీసీఎస్ వాటా 25,403.64 కోట్ల రూపాయలు. ఈ పెరుగుదలతో ఈ సంస్థ విలువ 7,87,400.51 కోట్ల రూపాయలకు చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ లాభపడిన సంస్థల జాబితాలో ఉన్నాయి. కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఇన్ఫోసిస్ సంస్థల విలువ తగ్గింది. రిలయన్స్ మిడ్‌కాప్ వ్యాల్యూ 9,762.29 కోట్ల రూపాయలు పెరిగి, 9,06,941.76 కోట్ల రూపాయలకు చేరింది. హెచ్‌యూఎల్ సంస్థ విలువ 7,934.03 కోట్ల రూపాయలు పెరగడంతో, 4,63,886.75 కోట్ల రూపాయలుగా నమోదైంది. హెచ్‌డీఎఫ్‌సీ విలువ 1,303.65 కోట్లు పెరడంతో 3,63,105.62 కోట్ల రూపాయలకు చేరింది. ఐటీసీ ఈవారం 1,658.68 కోట్ల రూపాయల మేరకు విలువను పెంచుకొని, 3,04,520.66 కోట్ల రూపాయలుగా స్థిరపడింది. కాగా, టీసీఎస్ తర్వాత అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ పెరిగింది. ఈ సంస్థ విలువ 20,271.20 కోట్ల రూపాయలు మెరుగుపడి, 3,03,054.59 కోట్ల రూపాయలకు చేరింది. ఎస్‌బీఐ విలువ 10,664.91 కోట్ల రూపాయలు పెరిగి, 2,51,317.06 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇలావుంటే, ఇన్ఫోసిస్ విలువ 55,921.50 పాయింట్లు పతనమై, 2,73,830.43 కోట్ల రూపాయల వద్ద ముగిసింది. అత్యున్నత అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న హెచ్చరికలు వినిపించిన నేపథ్యంలో, ఒక్క మంగళవారం నాటి ట్రేడింగ్‌లోనే ఇన్ఫోసిస్ విలువ 17 శాతం పడిపోయింది. కాగా, కోటక్ మహీంద్ర బ్యాంక్ విలువ 5,262.13 కోట్లు పతనమై, 3,03,293.39 కోట్ల రూపాయలకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 273.54 కోట్ల రూపాయలు నష్టపోవడంతో, దాని విలువ 6,72,192.76 పాయింట్లకు పడిపోయింది.