బిజినెస్

పసిడి ధరలు మరింత పైకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: పసిడి ధరలు మరింత పైపైకి వెళ్లనున్నాయా? అవునంటున్నారు వాణిజ్య విశే్లషకులు. భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, సెంట్రల్ బ్యాంకు స్థిరమైన కొనుగోళ్లు, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీన పడడం వంటి కారణాలు బంగారం మార్కెట్లకు మరింత ఊతమిచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఈక్రమంలో పసిడి ధరలు రెక్కలు తొడిగి ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 10గ్రాములు రూ. 42 వేల వరకు ఎగబాకే వీలుందని అంటున్నారు. ప్రధానంగా మధ్య, తూర్పు దేశాల్లో నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితువల్ల అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,650 డాలర్లకు, దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ. 42 వేలకు ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రముఖ విశే్లషకుడు జ్ఞాన శేఖర్ త్యాగరాజన్ సోమవారం నాడిక్కడ పీటిఐతో మాట్లాడుతూ అంచనా వేశారు. సెంట్రల్ బ్యాంకు స్థిరమైన కొనుగోళ్లు కూడా ఇందుకు తోడవుతాయని, ఈ పరిస్థితి ఈ ఏడాదంతా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం బంగారం ధర దేశీయంగా 10గ్రాములు రూ. 38,302గా ఉంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 1,506 డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఏడాది బంగారం వ్యాపారానికి బాగా కలిసొచ్చిందని, మంచి లాభాలు పంచిందని, ధరలు కూడా దేశీయంగా 15 శాతం పెరిగాయని మరో విశే్లషకుడు నవ్‌నీత్ దామనీ తెలిపారు. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 1.4 శాతం పడిపోవడం కూడా పసిడి వాణిజ్యానికి వెన్నుదన్నుగా మారిందన్నారు. ఐతే వాణిజ్య యుద్ధాల కారణంగా నెలకొన్న అనిశ్చితి పసిడి పరుగుకు పగ్గాలు వేసే అవకాశాలూ లేకపోలేదని, అలాగే అతిపెద్ద అర్థిక శక్తులైన దేశాల్లో సైతం ఆర్థికాభివృద్ధి మందగమనం నెలకొనడం వల్ల సెంట్రల్ బ్యాంకులు మరిన్ని సరళీకృత విధానాలను అనుసరించక తప్పదన్నారు. ఇందువల్ల బంగారం వ్యాపారం మరింతగా పుంజుకునే వీలుందని, డిసెంబర్ నాటికే రూ. 39,500కు 10 గ్రాముల ధర చేరుకునే అవకాశాలున్నాయని కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన మరో విశే్లషకుడు రవీంద్ర రావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులకు బంగారమే సురక్షితమైన మార్గంగా మదుపర్లు భావిస్తున్నారని, అందుకే మూడోత్రైమాసికంలో పసిడి వాణిజ్యం పుంజుకుందని ఆయన విశే్లషించారు. ప్రస్తుతం అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లోనూ, బ్రెగ్జిట్ డీల్ ఒడంబడికలోనూ స్తబ్ధత నెలకొనడం కూడా మదుపర్లను బంగారం వైపుచూసేలా దోహదం చేస్తున్నాయన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నివేదిక అంచనాలు ఈ విషయాలను ఇప్పటికే స్పష్టం చేశాయని మరో విశే్లషకుడు అభిషేక్ బన్సాల్ గుర్తు చేశారు. 2019లో అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి రేటు 3.5 శాతంగానే ఉంటుందని, 2020 నాటికి అది 3.6 శాతానికి చేరుతుందని ఐఎంఎఫ్ తాజాగా అంచనాలను సవరించింది. అంటే గత ఏడాది అక్టోబర్ నివేదికలో పేర్కొన్న అంచనాల కంటే తొలుత 0.2 శాతం, తర్వాత 0.1 శాతం తగ్గుదల నెలకొంది. గత సెప్టెంబర్ 14న సౌదీలోని ఆరామ్‌కో చమురు క్షేత్రంపై దాడులు జరిగినప్పటి నుంచి మధ్య, తూర్పు దేశాల్లో రాజకీయ, భౌగోళిక అనిశ్చితి నెలకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై లాంఛన అభిశంసనకు సెప్టెంబర్ 24న ప్రజాప్రతినిధులు పూనుకోవడం సైతం స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగా, బంగారానికి అనుకూలంగా పరిస్థితులను మార్చివేశాయని అభిషేక్ బన్సాల్ తెలిపారు.