బిజినెస్

ఇక ఓటీపీ ద్వారా రిఫండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: రైల్వే టిక్కెట్ల రద్దు, రీఫండ్‌లకు సంబంధించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభతరమైన విధానాన్ని రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. అధీకృత ఏజెంట్ల ద్వారా రిజర్వ్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేసుకున్న పక్షంలో రీఫండ్లకు సంబంధించి ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టింది. అధీకృత ఏజెంట్ల ద్వారా జరిగే టిక్కెట్ బుకింగ్‌లో పారదర్శకత పెంపొందుతుందని తెలిపింది. ఈ ఓటీపీ విధానం అధీకృత ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే ఈ-టిక్కెట్లకే వర్తిస్తుందని భారత రైల్వేల క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఓటీపీ విధానం వల్ల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని టిక్కెట్ల బుకింగ్‌లో పారదర్శకత కూడా పెంపొందుతుందని వెల్లడించింది. టిక్కెట్లను రద్దు చేసుకోవడం వల్ల ఎంత మొత్తం రీఫండ్‌గా వచ్చింది అన్నది ప్రయాణికులకు చాలా స్పష్టంగా తెలుస్తుందని, ఐఆర్‌సీటీసీ ఏజెంట్ల ద్వారా రిజర్వేషన్ల టిక్కెట్లు ఎప్పుడు రద్దు చేసుకున్నా ఓ పాస్ వర్డ్‌తో ఎస్‌ఎంఎస్ వస్తుందని, అలాగే ఎంత మొత్తంలో రీఫండ్ ఇస్తున్నది కూడా సదరు ప్రయాణికుల మొబైల్ నెంబర్లకు మెస్సేజ్‌ల ద్వారా వెళుతుందని తెలిపింది. ఈ రీఫండ్ మొత్తం పొందాలంటే తనకు వచ్చిన ఓటీపీని సదరు ఏజెంట్‌కు ఆ ప్రయాణికుడు తెలియజేయాల్సి ఉంటుంది ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ఇప్పటి వరకు కూడా ఏజెంట్లే తమ సొంత మొబైల్ నెంబర్లతో ప్రయాణికుల కోసం టిక్కెట్లు బుక్ చేసే వారని, టిక్కెట్ల రద్దు, రీఫండ్ సమాచారం కూడా వారికే వెళ్ళేదని ఈ ప్రకటనలో తెలిపింది. దీని కారణంగా రీఫండ్ మొత్తాన్ని సదరు ఏజెంట్ ప్రయాణికులకు ఇచ్చే వాడు కాదని ఆ విధంగా ప్రయాణికులు టిక్కెట్లు రద్దు చేసుకుని నష్టపోయే వారని ఐఆర్‌సీటీసీ అధికారి తెలిపారు. ఈ కొత్త ఓటీపీ విధానం వల్ల ప్రయాణికులు తమ మొబైల్ నెంబర్‌ను టిక్కెట్ బుకింగ్ సందర్భంలో ఇవ్వాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ప్రతి రోజూ 27 శాతానికి పైగా రైల్వే టిక్కెట్లు అధీకృత ఏజెంట్ల ద్వారానే బుకింగ్ అవుతున్నాయని, వీటిలో 20 శాతం టిక్కెట్లు రద్దు అవుతున్నాయని కూడా ఆయన తెలిపారు. టిక్కెట్ల రద్దు, రీఫండ్ ప్రక్రియను క్రమబద్ధీకరించే ఉద్దేశ్యంతోనే ఓటీపీ విధానాన్ని తీసుకుని వచ్చామని దీని వల్ల ప్రయాణికులకు సకాలంలోనే నిర్ణీత మొత్తం రీఫండ్‌గా అందుతుందని తెలిపారు.