బిజినెస్

పేద రాష్ట్రాలకూ ‘సీఆర్‌ఎస్’ సేవలు విస్తరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ఆర్థికంగా వెనుకబడిన ఝార్ఖండ్, చత్తీస్‌ఘడ్, బీహార్ రాష్ట్రాలతోబాటు, ఈశాన్య ప్రాంతాలకు ‘కార్పొరేట్ సామాజిక బాధ్య త’ (సీఆర్‌ఎస్)ను విస్తరించాల్సిందిగా ప్రభుత్వ, కార్పొరేట్ సంయుక్త సేవా వేదిక ‘ఇండియా ఇంక్’కు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. తొలిసారిగా మంగళవారం నాడిక్కడ జరిగిన ‘జాతీయ సీఆర్‌ఎస్ అవార్డుల ప్రదానోత్సవం’లో ఆమె పాల్గొని ప్రసంగించారు. గత ఏడాది ఈ ‘సీఆర్‌ఎస్’ పథకం ద్వారా రూ. 3వేల కోట్లు వెచ్చించినందుకు ఆమె ఈ సందర్భంగా కార్పొరేట్ కంపెనీలను ప్ర శంసించారు. ఒక విధంగా ఇది అంతర్వేదిలో జరిగిన అభివృద్ధి లాంటిదేనన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, తమిళ్‌నాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో సీఆర్‌ఎస్ కార్యకలాపా లు సాగుతున్నాయని, అదే క్రమంలో చత్తీస్‌ఘడ్, ఒడిషా, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో సైతం ఈక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాలను ఈవిషయంలో విస్మరించరాదని ఆమె సూచించారు. కేవలం సంపదను సృష్టించడం ద్వారా మాత్రమే కాదు సీఆర్‌ఎస్ ద్వారా తమవంతుగా జాతికి చేసిన సేవలకు గుర్తింపుగానే ఈ పురస్కారాలను అందజేస్తున్నామని తెలిపారు. న్యాయంగా ఆర్జించిన లా భాల నుంచి కొంత సామాజిక సేవకు వినియోగించాలన్నదే సీఆర్‌ఎస్ ప్రధానోద్దేశమని నిర్మల తెలిపారు. 2013 కంపెనీల చట్టంలోని 7వ అధికరణం మేరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఆర్‌ఎస్ సొమ్ము ను ఖర్చు చేస్తుండటం అభినందనీయమన్నారు. ప్రతి కంపెనీ కనీసం తన మూడేళ్ల వార్షిక సగటు నికర లాభాల్లో 2 శాతం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఆర్‌ఎస్) కార్యక్రమానికి వెచ్చించాలని ఆమె సూచించారు. కాగా సీఆర్‌ఎస్ కార్యకలాపాల్లో ఆరోగ్యం, విద్యా వికాసాలకు ప్రాధాన్యత నిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ సభలో మాట్లాడుతూ తెలిపారు. తాజాగా దేశంలో నీటి కొరత తమస్య వచ్చిందన్న విషయాన్ని ప్రధాన మంత్రి మోదీ సైతం తెలియజేశారని, అందువల్ల ఈ అంశంపై సమాజ సేవకులు దృష్టి నిలపాల్సిన అవసరం ఉం దని ఆయన సూచించారు.

*చిత్రం... కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్