బిజినెస్

దేశాభివృద్ధికి విశేష సేవలందిస్తున్న బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: దేశాభివృద్ధికి బ్యాంకులు విశేష సేవలు అందిస్తున్నాయని ఆంధ్రాబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుల్ భూషణ్ జైన్ అన్నారు. మంగళవారం ఇక్కడ సమగ్రత, జీవన విధానం లక్ష్యంతో ఆంధ్రాబ్యాంకు విజిలెన్స్ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన కార్యాలయం నుంచి బ్రాంచిల వరకు సిబ్బంది నిర్వహించి ప్రజలకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుల్ భూషణ్ జైన్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఏ అరవింద్ బ్యాంకు సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి బ్యాంకు సిబ్బంది విధేయత, అంకితభావంతో పనిచేయాలని వారు పేర్కొన్నారు. విజిలెన్స్ వారోత్సవాల ప్రాధాన్యతను తెలియచేస్తూ ఏటీఎం వ్యాన్‌ను ప్రదర్శించారు. అనంతరం ఈ వ్యాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. వారోత్సవాల సందర్భంగా సైకిళ్లు, వాకింగ్ ద్వారా పర్యటించి ప్రజలకు బ్యాంకు కార్యకలాపాలను సిబ్బంది వివరించారు. ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

*చిత్రం... వారోత్సవాల్లో పాల్గొన్న ఆంధ్రాబ్యాంకు సిబ్బంది