బిజినెస్

దీపావళి లాభాల వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : దీపావళి తర్వాత ‘సంవత్ 2076’లో తొలి వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు తారాజువ్వల్లా దూసుకుపోయిన లాభాలతో ఆరంభించాయి. త్వరలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఆర్థిక ఉద్దీపన చర్యలు చేపడుతుందని, ఆదాయ పన్నులోనూ కోత విధించే అవకాశాలున్నాయని వెలువడిన విశే్లషణలు మార్కెట్లకు మంచి ఊపునిచ్చాయి. దీపావళి నుంచి దీపావళి వరకు పరిగణించే హిందూ కేలండర్ ఏడాది ‘సంవత్ 2076’ ఆరంభ రోజైన మంగళవారం బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఉదయం నుంచే లాభాల పరుగు లంఘించుకుంది. ఓ దశలో ఏకంగా 666 పాయింట్లు ఎగబాకి చివరిగా 581.64 (1.48శాతం) పాయింట్లతో 39,831.84 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 39,917.01 పాయింట్ల గరిష్టాన్ని, 39,254.12 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే నిఫ్టీ సైతం 159.70 పాయింట్లు (1.37 శాతం) లాభపడి 11,786.85 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. మొత్తం రోజంతా మదుపర్లు వాటాల కొనుగోళ్లతో బిజీగా గడిపారు. ప్రధానంగా ప్రోత్సాహకరమైన కంపెనీల త్రైమాసిక ఫలితాలు, అమెరికా-చైనా వాణిజ్యల్లో పురోగతి మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. సెనె్సక్స్ చార్ట్‌లో టాటా మోటార్స్ భారీగా 17 శాతం లాభపడి అగ్రభాగాన నిలిచింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో నష్టాలను అధిగమించినట్టు ఆ కంపెనీ నమోదు చేయడం వల్ల ఇలా సానుకూలత లభించింది. అలాగే టాటాస్టీల్, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకీ, టెక్ మహీంద్రా, టీసీఎస్ సైతం పెద్ద యెత్తున 7.09 శాతం లాభపడ్డాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) 2.30 శాతం అదనంగా లాభపడింది. డిజిటల్ వ్యవహారాలు, యాప్స్ నిర్వహణకు తమ సంస్థ ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు అందులోకి 1.08 లక్షల కోట్ల వాటాలను చొప్పించనున్నట్టు ఆర్‌ఐఎల్ గత శుక్రవారం ప్రకటించడం స్టాక్‌మార్కెట్‌లో సానుకూలంగా మారింది. కాగా మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ 3.41 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో వాహన, లోహ సూచీలు 4.25 శాతం లానపడగా, ఇంధనం, పరిశ్రమలు, ఐటీ సూచీలు 2.32 శాతం లాభపడ్డాయి. మరోవైపు బీఎస్‌ఈలో టెలికాం సూచీ మాత్రమే నష్టాల (4.39శాతం) పాలైన రంగంగా నిలిచింది. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సైతం 1.12 శాతం లాభపడ్డాయి. కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలతోబాటు కేంద్రం తదుపరి ఆర్థికాభివృద్ధి చర్యలు చేపడుతుందని, ఆదాయ పన్నులో కోత విధిస్తుందన్న అంచనాలతోనే మార్కెట్లకు ఇలా రికార్డు స్థాయి ఊతం లభించిందని ప్రధానంగా లార్జ్‌క్యాప్ కంపెనీలు అనుకున్నదానికంటే మంచి ఫలితాలను సాధించాయని ప్రముఖ విశే్లషకుడు పరాస్ బోత్రా తెలిపారు. అలాగే వాహన కంపెనీలు కూడా గణనీయంగా లాభపడ్డాయన్నారు. అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో సానుకూలత, బ్రెగ్జిట్ డీల్ వచ్చే జనవరి వరకు ఆలస్యం కావడం వంటివి మధ్య కాలానికి అయోమయానికి తెరదింపే అవకాశాలున్నాయని విశే్లషకులు చెబుతున్నారు.
నష్టపోయిన ఆసియా మార్కెట్లు
ఆసియా ఖండంలో షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. టోక్యో మార్కెట్లు మాత్రం లాభాలను సంతరించుకున్నాయి. ఇక ఐరోపా మార్కెట్లు కూడా ఆరంభ ట్రేడింగ్‌లో నష్టపోయాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ స్వల్పంగా లాభపడి ఇంట్రాడేలో 70.84గా ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.97 శాతం తగ్గి బ్యారెల్ 60.97 డాలర్ల వంతున ట్రేడైంది.