బిజినెస్

కార్పొరేట్ కంపెనీల కార్యాలయాల నిర్మాణాలను లీజుకిచ్చిన ‘నెస్కో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ‘నెస్కో లిమిటెడ్’ సంస్థ ముంబయి నగరంలోని తన 6 లక్షల చదరపు అడుగుల ప్రధాన కార్యాలయ నిర్మాణాలను బుధవారం లీజుకిచ్చింది. ఇందులో ‘హియర్ టెక్నాలజీస్’, ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి ప్రముఖ కంపెనీలున్నాయి. ఇటీవల స్థిరాస్తి వ్యాపారం, ఎగ్జిబిషన్ సెంటర్, ఆహార పానీయాలు, ఇంజనీరింగ్ వ్యాపారంలోకి నెస్కో ప్రవేశించింది. ఈక్రమంలో ‘నెస్కో టవర్-4’ పేరిట ఒక మిలియన్ చదరపుటడుగుల లీజుకు కేటాయించగలిగే స్థలాన్ని ముంబయి గుర్‌గావ్ తూర్పు ప్రాంతంలో అభివృద్ధి చేసింది. ఇందుకు మొత్తం రూ. 600 కోట్లు వెచ్చించింది. ఇందులో మొత్తం 7 కార్పొరేట్ కంపెనీలకు 6 లక్షల చదరపుటడుగుల స్థలాన్ని లీజుకిచ్చామని, ఈ లావాదేవీల్లో తమకు స్థిరాస్తి సలహాదారు ‘జేఎల్‌ఎల్ ఇండియా’ సహకరించిందని నెస్కో మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణపటేల్ వెల్లడించారు. ఇప్పటి వరకు తమ సంస్ధ ‘నెస్కో 1,2,3 టవర్ల పేరిట 8 లక్షల చదరపుటడుగుల స్థలాన్ని అభివృద్ధి చేసి లీజుకివ్వడం జరిగిందన్నారు. మొత్తం 1.8 మిలియన్ చదరపుటడుగుల విస్తరణలో లీజుల ద్వారా రూ. 325 కోట్లు వార్షికాదాయం సమకూరే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. కాగా ఈ అరవై ఎకరాల స్థలంలో మరిన్ని వాణిజ్య టవర్లను తమ కంపెనీ అభివృద్ధి చేస్తుందని పటేల్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం మంచి నాణ్యతతో కూడిన గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్‌లకు మంచి డిమాండ్ ఉందన్నారు.