బిజినెస్

ఐయూసీని రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: ఇంటర్‌కనెక్షన్ యూసేజ్ చార్జి (ఐయూసీ)ని రద్దు చేయాలని, టెలికాం యూజర్స్ గ్రూప్ (టీయూజీ) డిమాండ్ చేసింది. దీని వల్ల మధ్య, దిగువ తరగతి ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశం ఉండదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఐసీయూ ప్రకారం ఆరు పైసల చార్జిని వసూలు చేస్తున్నారు. అయితే, ఐయూసీ స్థానంలోనే బిల్ అండ్ కీప్ (బ్యాక్) విధానా న్ని అమలు చేయాలని ట్రాయ్ భావిస్తున్నది. అయితే, పలు అభ్యంతరాలు, అవరోధాలు ఎదురుకావడంతో, బ్యాక్ అమలు తేదీని ట్రాయ్ నిరవధికంగా వాయిదా వేసింది. దీనిపై టీయూజీ స్పందిస్తూ, ఐయూసీ వడ్డింపులను జనవరి 1 నుంచి రద్దు చేయాలని ట్రాయ్‌ని కోరింది. బ్యాక్ విధానాన్ని ఎప్పుడు అమలు చేసినప్పటికీ, ఐయూసీని రద్దు చేస్తే, ప్రజలకు మేలు చేసిన వారవుతారని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత విధానం వల్ల పేద వర్గాలు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోలేక పోతున్నాయని విచారం వ్యక్తం చేసింది. ఒక్కో వినియోగదారుడి నుంచి ఐసీయూ కింద ఏడాదికి కనీసం 200 రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇది సామాన్యుడికి భారమని పేర్కొంది. ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరింది.