బిజినెస్

అమరావతిలో సిఐఐ కార్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: అమరావతిలో త్వరలో సిఐఐ కార్యాలయం ప్రారంభిస్తామని సిఐఐ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకు చెప్పారు. లేక్‌వ్యూ క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ప్రగతి మైదాన్ తరహాలో నేషనల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు యోచనలో సిఐఐ ఉందని ముఖ్యమంత్రికి వారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సిఐఐ సదస్సులు ఏర్పాటు చేస్తే ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తుందని వారు చెప్పారు. భవిష్యత్‌లోవిభిన్న వినూత్న ఆలోచనలతో పారిశ్రామిక సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి సూచించారు. ఆధునిక టెక్నాలజీ సహాయంతో పరిపాలనలో వచ్చిన మార్పులపై సిఐఐ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు. రియల్ టైమ్ మేనేజిమెంట్‌తో ఎప్పటికపుడు అభివృద్ధి కార్యక్రమాలను భేరీజు వేసుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.