బిజినెస్

ఈ-సిగరెట్లే నయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: ‘సరదా, సరదా సిగిరెట్టు...ఇది దొరలు తాగు భలే సిగిరెట్టు...పట్టుబట్టి ఓ దమ్ములాగితే, స్వర్గానికి ఇది తొలి మెట్టు..’ అనే ఈ పాట ‘రాముడు-్భముడు’ పాత చిత్రంలో భలే హిట్టయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వివాదం అంతా సాధారణ సిగిరెట్లకు, ఈ-సిగిరెట్లకు మధ్యే. ఈ-సిగిరెట్లు మార్కెట్‌లోకి వచ్చేసాయి. అయితే ఇవి వచ్చిన రెండు నెలలకే కేంద్ర ప్రభుత్వం ఈ-సిగిరెట్లను నిషేధించింది. దీంతో వాణిజ్య, వర్తకులు హైరానా పడ్డారు. ఈ మేరకు వర్తకుల ప్రతినిధులు మంగళవారం కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ను కలిసి సాధారణ సిగిరెట్ల కంటే ఈ-సిగిరెట్ల వల్ల ప్రాణానికి చాలా తక్కువ హాని కలిగిస్తుందని విన్నవించారు. దీనిపై యూకే నిర్వహించిన అధ్యయన నివేదికనూ అందజేశారు.
ఈ-సిగిరెట్ల వినియోగంపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, వ్యక్తం అవుతున్న నిరసనలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ-సిగిరెట్లను రద్దు చేస్తూ సెప్టెంబరలో ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ స్థానే ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టనున్నది. ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగిరెట్స్ (ప్రొడక్షన్, మ్యాన్యుఫాక్చర్, ఇంపోర్టు, ఎక్స్‌పోర్టు, ట్రాన్స్‌పోర్టు, సేల్, డిస్ట్రిబ్యూషన్, స్టోరేజ్ అండ్ అడ్వర్టైజ్‌మెంట్) బిల్లు-2019ను రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నది. సాధారణ సిగిరెట్ల కంటే ఈ-సిగిరెట్లను వాడడం వల్ల ప్రాణాలకు తక్కువ హాని ఉందని లండన్ (పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్) పేర్కొంది. సాధారణ సిగిరెట్లను తాగడం వల్ల ప్రతి ఏడాది సుమారు 220 మంది వరకు మరణిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ దేశాలన్నీ ఈ-సిగిరేట్ల వినియోగం వల్ల హాని తక్కువ ఉందని తెలియజేయాలని లండన్ (పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్) తెలిపింది. అమెరికా తదితర దేశాలు ఈ-సిగిరెట్లపై ఉన్న దురభిప్రాయంతో ఉన్నాయని పేర్కొంది. అయితే ఏదైనా అతిగా వినియోగిస్తే ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిపింది.
ఇలాఉండగా ఈ-సిగిరెట్లపై పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్‌ఇ) విడుదల చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుందని ఆశిస్తున్నామని వాణిజ్య, వర్తక వ్యాపారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే ముందు వర్తక, వాణిజ్య వ్యాపారులతో చర్చిస్తుందని ఆశిస్తున్నామని ‘ట్రెండ్స్’ సంస్థ కన్వీనర్ ప్రవీణ్ రిఖి తెలిపారు. సాంప్రదాయ సిగిరెట్లు తాగడం వల్ల ప్రతి ఏడాది దేశంలో 10 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ-సిగిరెట్లను తాగడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 18న నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ-సిగిరెట్లను తయారు చేసినా, వినియోగించినా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.