బిజినెస్

టూ టైర్, త్రీ టైర్ నగరాల్లో పారిశ్రామికవాడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: పారిశ్రామిక రంగంలో తెలంగాణ చకాచకా అడుగులు వేస్తోంది. దండుమల్కాపూర్‌లో పారిశ్రామిక వాడకు చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తల నుంచి లభించిన విశేషమైన డిమాండ్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) దూసుకుపోతోంది. రాష్ట్రంలో పలు నగరాల శివార్లలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసేందుకు టీఎస్‌ఐఐసీ కసరత్తును ముమ్మరం చేసింది. ఈ పార్కుల్లో పరిశ్రమలు పెట్టేందుకు రూ. 35వేల కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనావేసింది. రాష్ట్రంలో వివిధ చోట్ల పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఇంతవరకు 46వేల ఎకరాలను టీఎస్‌ఐఐసీ సేకరించింది. దాదాపు రూ.80వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటి నుంచి వివిధ నగరాలు, పట్టణాల వద్ద టీఎస్‌ఐఐసీ ముందు చూపుతో భూములను సేకరించింది. దండుమల్కాపూర్‌లో నెలకొల్పిన పారిశ్రామిక వాడకు రూ.750 కోట్ల పెట్టుబడులు ఖరారయ్యాయి. 12వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వరంగల్ శివార్లలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నారు. అతి పెద్ద జౌళి పార్కులో రూ.11,564 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పార్కు వల్ల 1.13లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించనున్నారు. జహీరాబాద్ వద్ద నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌ను 12,635 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం సహకారంతో ఈ పార్కును అభివృద్ధి చేస్తారు. ఆర్థిక మాంద్యం వల్ల కొంత కాలం పాటు నత్తనడకన సాగుతున్నా, ఇటీవల కేంద్రం ఈ ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకోవడంతో పార్కులో వౌలిక సదుపాయాల ఏర్పాటుకు బ్లూప్రింట్‌ను త్వరలో ఖరారు చేయనున్నారు. రూ.13,300 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 2.77 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద బుగ్గపాడు వద్ద రూ.110కోట్ల వ్యయంతో మెగా ఫుడ్ పపార్కు రానుంది. 60 ఎకరాలను సేకరించి వౌలికసదుపాయాలను నెలకొల్పుతారు. సిద్ధిపేట జిల్లాలో బండమైలారం వద్ద 150 ఎకరాల్లో మెగా విత్తనాల పార్కును నెలకొల్పనున్నారు.కోకాకోలా కంపెనీ కూడా ఇక్కడ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో 40 ఎకరాల్లో సుగంధ ద్రవ్యాల పార్కు, రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో వంద ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కు, ఇంకా మహేశ్వరం, రాకంచర్ల, బుచ్చనపల్లి , రావిరాలలో ఫుడ్‌పార్కులు ఏర్పాటుకు కసరత్తును ముమ్మరం చేశారు. 39 వేల ఎకరాల్లో 23 పారిశ్రామికవాడల ఏర్పాటుకు రూ..1825 కోట్ల వ్యయంతో వౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. వరంగల్ వద్ద రూ.31 కోట్లతో , నిజామాబాద్ వద్ద రూ. 50 కోట్లతో , కరీంనగర్ లో రూ.100 కోట్లతో, టీ హబ్, ఐటీ పార్కులను నెలకొల్పనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రం వద్ద రూ.25 కోట్లతో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు టీఎస్‌ఐఐసీ ప్రణాళికలను రూపొందించి అమలుకు సన్నాహాలు చేస్తోంది.