బిజినెస్

బాటిళ్లలో పెట్రోలు నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: రాష్ట్రంలోని అన్ని పెట్రోలు బంకుల్లో బాటిళ్లలో ‘పెట్రో’ విక్రయాలను నిషేధిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని పెట్రోలు పోసి సజీవంగా కాల్చి చంపిన సంఘటనతోపాటు పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ పనుల కోసం వస్తున్న కొందరు వ్యక్తులు తమ పనిలో అలసత్వం లేదా నిర్లక్ష్యం వహించే అధికారులు లేదా సిబ్బందిని పెట్రోల్ పోసి తగులబెడతామంటూ బెదిరిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయంతీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ఏ పెట్రోలు బంకుల్లోనూ బాటిళ్లలో
పెట్రోల్‌ను అమ్మరాదని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలు జరిగేది లేదని రాష్ట్రంలోని దాదాపు అన్ని బంకుల్లో బోర్డులు ఏర్పాటయ్యాయి. వాస్తవానికి బైక్ ఎక్కడో ఆగిపోతే, స్నేహితుడి బైక్ రోడ్డుపై నిలిచిపోతే, బాటిల్ తీసుకుని వచ్చి పెట్రోల్ పోయించుకుని వెళుతుండడం సహజం. ఇటీవల కాలంలో రాష్ట్రంలో హత్యలు, ఆత్మహత్యలకు పెట్రోల్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం దీనిని సీరియస్‌గా పరిగణించి బాటిళ్లలో పెట్రోల్ విక్రయించరాదని స్పష్టం చేసింది. దీంతో పెట్రోల్ బంకుల్లో ‘నో పెట్రోల్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్’ అన్న పేరుతో బోర్డులు వెలిశాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఇతర వాహనాలు బంకుకు తీసుకువచ్చి పెట్రోలు పోయించుకోవాలని బంకు యాజమానులు చెబుతున్నారు.