బిజినెస్

మరోమారు దిగివచ్చిన పసిడి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: పసిడి ధరలు మంగళవారం మరోమారు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 130 తగ్గి మొత్తం ధర రూ. 38,500కు దిగివచ్చింది. సోమవారం ఈ ధర రూ. 38,680గా ఉంది. కాగా వెండి ధర సైతం దిద్దుబాటుకు గురై తాజాగా కిలోపై రూ. 90 తగ్గి మొత్తం ధర రూ. 45,080కి చేరింది. అలాగే 24 క్యారెట్ల స్పాట్ గోల్డ్ ధరలు సైతం రూ. 130 తగ్గాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో సైతం ధరలు తగ్గిన బంగారం ఔన్సు 1,453 డాలర్లుగా ట్రేడైంది. వెండి ఔన్సు ధర 16.81 డాలర్లు పలికింది. ఈనెలలోనే అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో మధ్యంతర ఒప్పందం కుదిరే అవకాశాలున్నట్టు వచ్చిన తాజా వార్తలతో స్టాక్ మార్కెట్లకు అనుకూలంగానూ, వెండి, బంగారు వాణిజ్యానికి ప్రతికూలంగానూ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.