బిజినెస్

బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌కు 77వేల మంది ఉద్యోగులు సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్న దాదాపు 77 వేల మంది ఉద్యోగులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం కోసం ఇప్పటి వరకు ఆష్షన్లు ఇచ్చారని విశ్వసనీయ అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ పథకానికి ప్రస్తుతం పనిచేస్తున్న 1.50 లక్షల మందిలో లక్షమంది ఉద్యోగులు అర్హులని బీఎస్‌ఎన్‌ఎల్ తేల్చింది. 2020 జనవరి 31 నాటికి ఈ పథకం అమలు చేయాల్సి ఉంది. ఐతే ఇందుకు సంబంధించిన ఇటీవల విడుదలైన ఆప్షన్లు డిసెంబర్ 3 వరకు ఓపెన్‌లో ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు. మొత్తం వేతన ఖర్చుల్లో కనీసం రూ. 7వేల కోట్ల రూపాయలు ఆదా చేసే లక్ష్యంతో బీఎస్‌ఎన్‌ఎల్ ఈ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈక్రమంలో 50 ఏళ్ల పైబడిన ఉద్యోగులు ఇందుకోసం ఇచ్చికాన్ని తెలియజేయవచ్చు.