బిజినెస్

రైతు బజార్లలో రూ. 25కే ఉల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: రాష్ట్రంలోని రైతు బజార్లలో ఉల్లిపాయలను కిలో 25 రూపాయలకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మార్కెటింగ్ శాఖపై గురువారం జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నెల రోజులపాటు రైతు బజార్లలో కిలో 25 రూపాయలకే విక్రయించాలని తెలిపారు. రైతుల నుంచి సీసీఐ కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని, మార్క్‌ఫెడ్ ద్వారా వేరుశనగను కొనుగోలు చేయాలని ఆదేశించారు. వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి ఈ-పర్మిట్ సిస్టం అమలు చేయాలని నిర్ణయించారు.