బిజినెస్

అశోక్ బిల్డ్‌కాన్‌కు భారీ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: అశోకా బిల్డ్‌కాన్ సంస్థకు భారీ కాంట్రాక్టు లభించింది. ఈ కంపెనీకి అనుబంధ సంస్థగా ఉన్న అశోకా కనె్సషన్స్ లిమిటెడ్ (ఏసీఎల్)కు తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టు కోసం 1,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్‌ఓఏ)ను నేషనల్ హైవీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అందచేసింది. ఈ విషయాన్ని ఏసీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్‌హెచ్‌ఐఏ నుంచి ఎల్‌ఓఏ అందిందని, కాండీ నుంచి రాంసాన్‌పల్లి వరకు జాతీయ రహదారి 161పై ఈ ప్రాజెక్టు పనులు జరుతాయని పేర్కొంది. భారతాత్మ పరియోజన పథకం కింద ఈ ప్రాజెక్టును తెలంగాణకు మంజూరు చేసినట్టు ఏసీఎల్ వివరించింది. తాము దాఖలు చేసిన బిడ్‌కు ఎన్‌హెచ్‌ఏఐ అనుమతి లభించిందని, ప్రాజెక్టు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.