బిజినెస్

మార్కెట్లోకి సరికొత్త ‘బొలెరో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశీయ ఆటోమొబైల్ సంస్థ ఎంఅండ్‌ఎం (మహీంద్రా అండ్ మహీంద్రా) సోమవారం సరికొత్త బొలెరో ఎస్‌యువి (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)ను ఆవిష్కరించింది. ముంబయిలో దీని ఎక్స్-షోరూమ్ ధర 6.59 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బొలెరో వాహనం కంటే దాదాపు లక్ష రూపాయల తక్కువ ధరకే ఇది లభ్యం కానుంది. బొలెరో పవర్ ప్లస్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కొత్త వేరియంట్‌లో ఎంహక్ డి-70 ఇంజన్‌ను అమర్చామని, ఇంతకుముందు ప్రవేశపెట్టిన బొలెరో కంటే 13 శాతం అధిక శక్తితో నడిచే బొలెరో పవర్ ప్లస్ 5 శాతం ఎక్కువ మైలేజీని ఇస్తుందని ఎంఅండ్‌ఎం ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్) ప్రవీణ్ షా తెలిపారు. 2000 సంవత్సరంలో తొలిసారి బొలెరో వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టిన ఎంఅండ్‌ఎం ఇప్పటివరకూ ఈ కార్లను 9 లక్షలకు పైగా అమ్మింది. అధిక శక్తి, ఇంధన సామర్ధ్యం పెంపుతో తక్కువ ధరకు లభ్యమయ్యే బొలెరో పవర్ ప్లస్ కొనుగోలుదారుడి సొమ్ముకు ఎంతో విలువైనదిగా ఉంటుందని, దేశ వ్యాప్తంగా మూడు వేర్వేరు వేరియంట్లలో (ఎస్‌ఎల్‌ఇ, ఎస్‌ఎల్‌ఎక్స్, జడ్‌ఎల్‌ఎక్స్) బొలెరో పవర్ ప్లస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన చెప్పారు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (డిఐఎస్), వాయిస్ మెసేజింగ్ సిస్టమ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఎన్నో అత్యాధునిక ఫీచర్లను బొలెరో పవర్ ప్లస్‌లో పొందుపర్చినట్లు ప్రవీణ్ షా వివరించారు.

చిత్రం.. అత్యాధునిక ఫీచర్లతో అలరిస్తున్న ‘బొలెరో పవర్ ప్లస్’ ఎస్‌యువి