బిజినెస్

అంతుచిక్కని గమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 23: భారత స్టాక్ మార్కెట్లు ఏ దిశగా వెళుతున్నాయన్నది అగమ్యగోచరంగా మారింది. ఎవరికీ అంతుచిక్కని రీతిలో లాభనష్టాల దాగుడుమూతలు కొనసాగుతున్నాయి. ఈ వారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో లావాదేవీలను పరిశీలిస్తే, ఈవారం మొత్తం అనిశ్చితిలోనే ట్రేడింగ్ కొనసాగిందనే విషయం స్పష్టమవుతున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలు స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. కార్పొరేట్ రంగానికి ఊతమిచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, అదే విధంగా ఎగుమతులను పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆమె వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. దీనితో తదుపరి ప్రకటనలు ఏ విధంగా ఉండబోతున్నాయనే అనుమానాల మధ్య స్టాక్ మార్కెట్ ఊగిసలాడింది. చివరికి బీఎస్‌ఈలో సెనె్సక్స్ 2.72 పాయింట్ల నామమాత్రపు పెరుగులను నమోదు చేసింది. ఈవారం ట్రేడింగ్‌కు తొలి రోజైన సోమవారం ఆరంభం నుంచి భారీ నష్టాలను ఎదుర్కొన్న సెనె్సక్స్ ఆతర్వాత కొంత తేరుకుంది. కానీ, పాయింట్ల పతనం మాత్రం తప్పలేదు. 72.50 పాయింట్ల నష్టంతో 40,284.10 పాయింట్లకు చేరింది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంది. 10.95 పాయింట్లు నష్టపోయి, 11,884.50 పాయింట్లుగా నమోదైంది. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఊతమివ్వడంతోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేపట్టిన చర్యల కారణంగా మంగళవారం స్టాక్ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. సెనె్సక్స్ 185.51 పాయింట్లు పెరిగి, 40,469.70 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 55.60 పాయింట్లు అధికంగా, 11,948.10 పాయింట్లకు చేరింది. స్టాక్ మార్కెట్ మళ్లీ గాడిలో పడిందని బుధవారం నాటి ట్రేడింగ్ ఆశలు రేపింది. సెనె్సక్స్ 177.67 పాయింట్లు లాభంతో 40,647.35 పాయింట్లకు చేరగా, నిఫ్టీ 40.65 పాయింట్లు పెరగడంతో 11,980.75 పాయింట్ల వద్ద ముగిసింది. కానీ, రెండు రోజుల లాభాలకు గురువారం బ్రేక్ పడింది. భారీ నష్టాల నుంచి బయటపడినప్పటికీ, స్వల్ప పతనం తప్పలేదు. 76.47 పాయింట్లు పడిపోయిన సెనె్సక్స్ 40,575.17 పాయింట్లకు పతనమైంది. నిఫ్టీ 30.70 పాయింట్లు కోల్పోయి 11,968.40 పాయింట్ల వద్ద ముగిసింది. లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం మార్కెట్లు మరింతగా నష్టపోయాయి. సెనె్సక్స్ 215.76 పాయింట్లు పతనం కావడంతో 40,359.41 పాయింట్లుగా నమోదైంది. నిఫ్టీ 54 పాయింట్లు తగ్గడంతో 11,914.40 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద ఈ వారం స్టాక్ మార్కెట్లు మొదటి రోజు నష్టం, ఆతర్వాత రెండు రోజులు లాభం, తిరిగి చివరి రెండు రోజులు నష్టాల్లో ముగిశాయి.
టాటా మోటార్స్, ఎస్ బ్యాంక్ ఔట్!
సెనె్సక్స్ 330 స్క్రిప్2 నుంచి టాటా మోటార్స్, ఎస్ బ్యాంక్ వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం. ఆసియా ఇండెక్స్ తెలిపిన వివరాల ప్రకారం టాటా మోటార్స్, టాటా మోటార్ డీవీఆర్, ఎస్ బ్యాంక్, వేదాంత కంపెనీల షేర్లు 330 స్క్రిప్2లో స్థానాన్ని కోల్పోనున్నాయి. ఆ స్థానంలో టైటాన్, అల్ట్రా సిమెంట్, నెస్లే ఇండియా కంపెనీల షేర్లు చేరతాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఈ మార్పు అమల్లోకి వస్తుంది. సూచీల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ మార్పులు చోటు చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయంపై బీఎస్‌ఈ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.