బిజినెస్

ఎగుమతులపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎగుమతులను మరింత పెంచేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు కేంద్రం ఇటీవల చేసిన ప్రకటనకు భారీ స్పందన కనిపిస్తున్నది. దాదాపుగా అన్ని రంగాలకు చెందిన కంపెనీలు, సంస్థలు ఎగుమతులపై దృష్టి పెట్టాయి. ఎగుమతులను మరింతగా పెంచాలంటే, వివిధ వస్తుసేవలపై పన్ను, సర్‌చార్జీల మినహాయింపు తప్పనిసరి అన్న వాదన చాలాకాలంగా ఉంది. భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) కూడా జీఎస్‌టీని పూర్తిగా రద్దు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. కాగా, జాతీయోత్పత్తిలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన వ్యవసాయ రంగం ఎగుమతుల పెంపుదలకు పలు సూచనలు చేస్తున్నది. ఇవి అమలు చేస్తే, ఎగుమతులు పెరుగుతాయన్నది ఈ రంగంలోని నిపుణులు, వ్యాపారవేత్తల అభిప్రాయం. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎగుమతులపై సబ్సిడీని ప్రకటించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులు, ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రత్యేక నిధులను కేటాయించాలని ఈ రంగంలోని పలువురు ప్రముఖులు అంటున్నారు. అన్ని విధాలా చేయూతనిస్తే తప్ప ఎగుమతులు ఆశించిన స్థాయిలో పెరగవన్న ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతుల లక్ష్యాన్ని 375 బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. అదే విధంగా ఈ రంగంలో లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. అయితే, లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఏటా సుమారు 325 నుంచి 330 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగాలన్నా, తప్పనిసరిగా ప్రోత్సాహకాలను అందించాలని ఈ రంగంలోని నిపుణులు చేసిన సూచన పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించడంతో పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తున్నది. కాగా, ద్రవ్య లబ్ధత సమస్య అన్ని రంగాల మాదిరిగానే ఎగుమతుల రంగాన్ని కూడా వేధిస్తున్నది. దీని నుంచి బయటపడాలనంటే, జీఎస్‌టీని ఏకమొత్తంగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఎగుమతిదారులు చెల్లించిన జీఎస్‌టీని సాధ్యమైనంత త్వరగా తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నది. కానీ, ప్రతిసారీ ఏదో ఒక కారణంగా జీఎస్‌టీ రిఫండ్ ఆలస్యం అవుతునే ఉందనేది వాస్తవం. జీఎస్‌టీ రిఫండ్‌లో జాప్యమవుతున్న కొద్దీ ద్రవ్య లబ్ధత సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. విదేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలంటే, దేశీయంగా ఉత్పత్తులు పెరగాలి. వ్యవసాయం కష్టసాధ్యంగా మారుతున్న నేపథ్యంలో, ఉత్పత్తులను పెంచడం అసాధ్యంగా మారింది. కాబట్టి, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యేక సబ్సిడీని ప్రకటించడంతోపాటు, ఎగుమతులపై అన్నిరకాల పన్నులను ఎత్తివేయక తప్పదు. అంతేగాక, ఉత్పత్తులను పెంచడానికి అవసరమైన వౌలిక సదుపాయాల కల్పన జరగాలి. ఈ విషయంలోనూ ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరించాలి. ఈ దిశగా చర్యలు తీసుకోకపోతే, ఎగుమతులను పెంచడం అసాధ్యమవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో ఎగుమతులు పెరగడంతో పరిస్థితి ఆశాజనకంగా మారింది. చాలాకాలంగా సుమారు 300 బిలియన్ డాలర్లకు వరకూ ఎగుమతులు జరుగుతున్నాయి. అయితే, ప్రభుత్వం 375 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా ఎంచుకుంది. ఈ లక్ష్యాన్ని అం దుకోవాలంటే, రత్నాలు, ఆభరణాలు, బియ్యం, చర్మం, టీ, కాఫీ, జీడిపప్పు తదితరాల ఎగుమతులు పెరగాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటే, ఎగుమతుల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమేమీ కాదు. కేంద్రం తీసుకోబోయే కీలక నిర్ణయాల్లో ఈ ప్రతిపాదనలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ఎగుమతిదారులు ఆశిస్తున్నారు.