బిజినెస్

దిగిరాని ఉల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 24: రాష్ట్రంలో బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు ఘాటెక్కాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలు 80 నుంచి 100 రూపాయల ధరకు విక్రయిస్తున్నారు. ధరల స్థీరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఉల్లి ధర తగ్గలేదు. ఉల్లి ధరను నియంత్రించేందుకు వీలుగా కర్నూలు నుంచి రోజుకు 150 మెట్రిక్ టన్నులు మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసి 80 రైతుబజార్ల ద్వారా విక్రయిస్తోంది. ప్రస్తుతం 48 నుంచి 55 రూపాయల చొప్పున కర్నూలు ఉల్లిని కొనుగోలు చేసి రైతుబజార్లలో విక్రయిస్తున్నారు. రైతుబజార్లలో 25 రూపాయలకు సరఫరా చేస్తుండటంతో అక్కడ భారీగా క్యూలు కనిపిస్తున్నాయి. అయితే రోజుకు మనిషికి కిలో ఉల్లి మాత్రమే చాలాచోట్ల ఇస్తుండటంతో గంటల పాటు ప్రజలు క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వస్తోంది. కార్తీక మాసం ఆఖరి శని, ఆదివారాలు కావడంతో పిక్నిక్‌ల సందడి ఇంకా కొనసాగుతోంది. దీంతో ఉల్లిపాయలకు డిమాండ్ పెరిగింది.