బిజినెస్

రెండో త్రైమాసిక జీడీపీ వృద్ధిరేటు 4.7 శాతమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు వరుసగా ఆరోత్రైమాసికంలోనూ మందగించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ అనుబంధ విభాగం ‘ఇండి యా రేటింగ్స్ అండ్ రీసెర్స్’ మంగళవారం నాడిక్క డ విడుదల చేసిన అధ్యయన నివేదిక హెచ్చరించింది. గడచిన జూలై నుంచి సెప్టెంబర్ మాసం వర కు గల త్రైమాసికానికి జీడీపీ వృద్ధిరేటు 4.7 శాతానికి పడిపోతుందని ఆ సంస్థ అంచనా వేసింది. గతంలో ఇచ్చిన 5.6 శాతం అంచనాలను ఆ సంస్థ తాజాగా తగ్గించివేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్ధ ఇలా అంచనాలు సవరించడం నాలుగోసారి. గత ఏప్రిల్ నుంచి జూన్ వరకు గల త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు ఏకంగా ఏడేళ్ల కనిష్ట స్థాయి (2013 నుంచి ఇప్పటి వరకు) 5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో గడచిన ఆరు త్రైమాసికాల ఆర్థిక స్థితిగతులను బేరీజువేసుకుని ఈ తాజా అంచనాలను రూపొందించామని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఈ సందర్భంగా ప్రకటించింది. అంటే 2012 నుంచి ఇప్పటి వరకు ఇవే అత్యంత కనిష్ట స్థాయి అంచనాలు కావడం గమనార్హం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్పొరేట్ పన్నుల కోత తాలూకు ప్రభావాన్ని కూడా అంచనా వేశామని ఆ సంస్ధ తెలిపింది. 2020 జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతంగా ఉంటుందని ఇదే సంస్థ నెల రోజుల క్రితమే తెలిపింది. ఐతే రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 4.7 శాతానికే పరిమితమవుతుందని ఆ సంస్థ తాజాగా వెల్లడించింది. వాస్తవ అంచనాలు శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ఫిచ్ అనుబంధ భారతీయ సంస్థ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్‌బీఎఫ్) సంస్ధలు రీటెయిల్ వాణిజ్యాన్ని విస్తరించడం, కార్ల తయారీదారులు, గృహ విక్రయాలు, భారీ పరిశ్రమలు అభివృద్ధిలేమితో ఇక్కట్లు పడడం వంటివి వృద్ధిరేటుకు ప్రతిబంధకంగా ఉన్నాయని తెలిపింది.