బిజినెస్

రెండు ‘కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు’ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: ఎస్‌బీఐ కార్డ్, విమానయాన సంస్థ ‘విస్టారా’ సంయుక్తంగా మంగళవారం రెండు ప్రీమియం కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులను విడుదల చేశాయి. ప్రయాణికులు ఉచితంగా టికెట్ రద్దు చేసుకునేందుకు, కావలసిన భాషను ఎంపిక చేసుకునేందుకు ఉపయుక్తంగా ఉండే ఈ కార్డులు అదనపుఫ్రీక్వెంట్ ఫ్లైయర్ పాయింట్ల సదుపాయాలతో ఉంటాయని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండు వెర్వేరు రకాల విశిష్టతలతో కూడిన ఈ ‘క్లబ్ విస్తారా ఎస్‌బీఐ’ కార్డులు వివిధ ప్రయోజనాలు, ప్రాధాన్యతలను కలిగి ఉంటాయన్నారు. ఇందులో కాంప్లిమెంటరీ క్లబ్ విస్టారా సిల్వర్‌తో కూడిన బేస్‌టైర్ సభ్యత్వం ఉంటుందన్నారు. అలాగే ఈ కార్డులపై ప్రయాణ బీమా రక్షణ, లాంజ్‌లోకి ప్రవేశించే వోచర్లు, ప్రియారిటీ పాస్ సదుపాయంతోబాటు పాయింట్లను బట్టి వివిధ రివార్డులు సైతం ఉంటాయని విమానయాన సంస్థ విస్టారా తెలిపింది. కాగా ఎస్‌బీఐ కార్డ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 74 శాతం వాటాలున్నాయి. మిగిలిన 25 శాతం వాటాలు అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ ‘కార్లైల్ గ్రూప్’ కలిగివుంది. ‘క్లబ్ విస్టారా ఎస్‌బీఐ కార్డు ప్రైమ్’ను ఏడాదిపాటు పొందగోరే విమాన ప్రయాణికులు రూ. 2,999తోబాటు జీఎస్టీని చెల్లించాల్సివుంటుంది. అలాగే ‘క్లబ్ విస్టారా ఎస్‌బీఐ కార్డును ఏడాదిపాటు పొందగోరేవారు రూ. 1,499తోబాటు జీఎస్టీని చెల్లించాలి. క్లబ్ విస్టా రా ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ కైవసం చేసుకున్న వారు విమాన టికెట్టుపై వెచ్చించే ప్రతి వంద రూపాయలకు 9 క్లబ్ విస్టారా పాయింట్లు పొందుతారు. అలాగే వార్షిక సీవీ సిల్వర్ టైర్ సభ్యత్వాన్ని కాంప్లిమెంట్‌గా పొందుతారని విస్టారా వివరించింది.