బిజినెస్

రికార్డు స్థాయి గరిష్టాల నుంచి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాల నుంచి మంగళవారం ఒక్కసారిగా నష్టాల్లోకి జారాయి. టెలికం, ఐటీ, వాహన స్టాక్స్‌లో మదుపర్లు పెద్దయెత్తున లాభాల స్వీకరణకు దిగడం ఇందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా మహారాష్టల్రో నాటకీయంగా మారిన రాజకీయ పరిణామాలు, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్థిరేటు 4.7 శాతానికి పడిపోతుందన్న అంతర్జాతీయ అధ్యయన, రేటింగ్స్ సంస్థ 3్ఫచ్‌లో అంతర్భాగమైన 3ఇండియా రేటింగ్స్ అం డ్ రీసెర్చ్2 బలహీన వృద్థిరేటు అంచనాలు మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఈక్రమంలో రెండు సూచీలూ స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఉదయం నుంచే ఊపుమీద కనిపించింది. ఇంట్రాడేలో ఈ సూచీ 41,120.28 పాయింట్ల అత్యున్నత గరిష్టానికి ఎగబాకింది. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీ తిరోగమనం మొదలై చివరికి 67.93 పాయింట్లు (0.17 శాతం) నష్టపోయి 40,821.30 పాయింట్ల దిగువ స్థాయిలో స్థిరపడింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ సైతం ఓ దశలో ఇంట్రాడే గరిష్టం 12,132.45 పాయింట్లకు చేరింది. ఈ స్థితిలో లాభాల స్వీకరణ జరగడంతో చివరికి ఈ సూచీ 36.05 పాయింట్లు (0.30 శాతం) నష్టపోయి 12,037.70 పాయింట్ల దిగువ స్థాయిలో స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా 4.34 శాతం నష్టపోయింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సవరించిన స్థూల ఆదాయంపై ప్రభుత్వానికి భారీగా లైసెన్స్ ఫీజు బకాయిపడ్డ ఈ కంపెనీకి ఉన్న దీర్ఘకాలిక గ్రేడింగ్‌ను 3ఇక్రా2 తగ్గించింది. అలాగే తాజా త్రైమాసికానికి స్పెక్ట్రం వాడకానికి సంబంధించిన బకాయిలు సైతం తడిసి మోపెడయ్యాయి. ఈక్రమంలో స్టాక్ మార్కెట్లోని కంపెనీ వాటాలపై ప్రతికూల ప్రభావం పడిందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. కాగా కీలక ఐటీ స్టాక్స్ టీసీఎస్ 1.6శాతం , ఇన్ఫోసిస్ సైతం 1.05 శాతం నష్టాలను సంతరించుకున్నాయి. అలాగే హెచ్‌సీఎల్ టెక్ వాటాలు 1.29 శాతం క్షీణించాయి. బలహీన వృద్ధిరేటు అంచనాలతో వాహన స్టాక్స్ నష్టపోయాయి. మారుతి 1.52 శాతం, ఎంఅండ్‌ఎం 1.67 శాతం, టాటామోటార్స్ 1.36 శాతం వంతున నష్టపోయాయి. పవర్‌గ్రిడ్ 2.26 శాతం, సన్‌పార్మా 1.75 శాతం నష్టాలపాయలయ్యాయి. ఐతే ప్రభుత్వం తాజాగా చేపట్టిన ఆర్థిక ఉద్దీపన చర్యలు విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే వీలుందని ప్రముఖ విశే్లషకుడు వినోద్‌నాయర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక లాభపడిన సంస్థల్లో ఐసీఐసీఐ బ్యాంక్ 2.26 శాతంతో అగ్రభాగాన నిలిచింది. అలాగే ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.46 శాతం, టాటాస్టీల్ 1.17 శాతం, ఐటీసీ 0.52 శాతం లాభపడ్డాయి. ఇక రంగాలవారీగా చూస్తే బీఎస్‌ఈలో టెలికం సూచీ 4.93 శాతం నష్టాలపాలైంది. టెక్, ఐటీ, కేపిటల్ గూడ్స్, పారిశ్రామిక, వాహన, స్థిరాస్తి, విద్యుత్ సూచీలు సైతం అదేబాట పట్టి 1.95 శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈలో బ్యాంకెక్స్, ఫైనాన్స్, ఎంఎఫ్‌సీజీ సూచీలు లాభాలను నమోదు చేశాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.79 శాతం నష్టపోయాయి.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం 20 పైసలు బలపడి ఇంట్రాడేలో 71.53గా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.18 శాతం వృద్ధితో బ్యారెల్ 62.73 డాలర్ల వంతున ట్రేడైంది. ఆసియా మార్కెట్లలో షాంఘై, టోక్యో లాభపడగా, హాంగ్‌కాంగ్, సియోల్ నష్టపోయాయి. అలాగే ఐరోపా స్టాక్స్ ఆరంభ ట్రేడింగ్‌లో మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి.