బిజినెస్

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: బంగా రు ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారంపై రూ. 68 తగ్గి మొత్తం ధర 38,547కు చేరింది. ఇందుకు ప్రధాన కారణం రూపా యి మారకం విలువ పెరగడమేనని వాణిజ్య వర్గాలు తెలిపాయి. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే స్పాట్ రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 16 పైసలు బలపడిందని సీనియర్ విశే్లషకుడు తపన్ పటేల్ తెలిపారు. విదేశీ నిధులు భారీ స్ధాయిలో రావడంతోబాటు ఈక్విటీ మార్కెట్లలో పెరిగిన లాభాలతో రూపాయి విలువ పెరిగిందన్నా రు. ఇక వెండి ధర సైతం కిలోపై రూ 39 తగ్గి మొత్తం ధర రూ. 45,161గా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగా రం ధరలు రెండు వారాల కనిష్టానికి పడిపోయాయి. అమెరికా-చైనా వాణి జ్య చర్చలు ఫలప్రదంగా సాగడంతో మదుపర్ల దృష్టి స్టాక్ మార్కెట్ల వైపు మళ్లిందని విశే్లషకులు చెబుతున్నారు. ఈక్రమంలో ఔన్స్ బంగారం ధర 16.88 శాతం తగ్గి మొత్తం ధర 1,455.30 డాలర్లకు దిగివచ్చింది. ఇక భారతీయ విఫణిలో (్ఢల్లీలో) 0.999 స్వచ్ఛ బంగారం (10 గ్రాములు) స్పాట్ ధర రూ. 10 తగ్గి రూ. 39.150గా ట్రేడవగా, ముంబయిలో రూ. 25 తగ్గుదలతో రూ. 39,105గా, అహ్మదాబాద్‌లో రూ. 15 తగ్గుదలతో రూ. 39,125గా ట్రేడైంది.