బిజినెస్

ఒక శాతానికి పైగా లాభపడిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: ఎస్సెల్ గ్రూప్ నుంచి రూ. 167 కోట్ల ఆర్థిక చేయూతను అందుకున్న హెచ్‌డీఎఫ్‌సీ ఆస్తుల నిర్వహణ కంపెనీ (హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ) వాటాలు బుధవారం ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. అలాగే అంతర్జాతీయంగా పేరెన్నికగన్న సూచీ నిర్వహణ సంస్థ ఎంఎస్‌సీఐ సైతం తమ కంపెనీ భారత విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీకి చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించడం సానుకూలంగా మారింది. ఈనెల 26 నుంచి ఈ మార్పులు అమలులోకి రావడం కంపెనీకి కలసివచ్చింది. బీఎస్‌ఈలో బుధవారం ఈ కంపెనీ వాటాలు ఇంట్రాడే గరిష్ట స్ధాయికి చేరాయి. ఒక దశలో ఒక్కో వాటా 2.63 శాత వృద్ధితో రూ. 3,688.20 వంతున ట్రేడయ్యాయి. ఐతే చివరిగా 1.35 శాతం వృద్ధితో రూ. 3,642.15 వద్ధ స్థిరపడింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఒక్కోవాటా 3.1 శాతం వృద్ధితో రూ. 3,633గా ట్రేడైంది. వాణిజ్య విలువనుబట్టి ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీకి చెందిన 6.5 లక్షల వాటాలు ట్రేడవగా, బీఎస్‌ఈలో 49వేల వాటాలు ట్రేడయ్యాయి. అలాగే కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు పెరిగి మొత్తం విలువ రూ. 77,442.65 కోట్లకు ఎగబాకింది.