బిజినెస్

రూ. 100 లక్షల కోట్లతో వౌలిక వసతుల రంగాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: వౌలిక వసతుల రంగాన్ని వచ్చే ఐదేళ్ల కాలంలో రూ. 100 లక్షల కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యం కేంద్ర ప్రభుత్వానికి ఉందని రైల్వే, వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయెల్ నాడిక్కడ తెలిపారు. ‘అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన’లో బుధవారం నాడిక్కడ ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధానంగా విమానాశ్రయాలు, రహదారులు, జాతీయ రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, విద్యుత్, చమురు..సహజవాయువులు వంటి అన్ని వౌలిక వసతుల అనుబంధ శాఖల్లో మంచి నాణ్యతతో కూడిన వౌలిక సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయం జరిగిందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ శాఖల్లో గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకోవడం తథ్యమన్నారు. ప్రధానంగా రైల్వేలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు 12 సంవత్సరాల కాలవ్యవధితో ఓ ప్రణాళికను రూపొందించడం జరిగిందని, ఇందుకోసం రూ. 50 లక్షల కోట్లు వెచ్చించడం జరుగుతుందని పీయూష్ గోయెల్ వెల్లడించారు. కాగా రూ. 100 లక్షల కోట్లు భారీమొత్తం వెచ్చించగలిగే స్థితిలో ప్రస్తుతం ప్రభుత్వం లేనందున ప్రైవేటు రంగానికి ఈ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన ఉందన్నారు. అంటే ఈ బృహత్ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు సంయుక్త భాగస్వామ్యంతో ముందుకు సాగాల్సివుందన్నారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ) లాంటి మెగా వాణిజ్య ఒప్పందంలో పాలుపంచుకోరాదన్న ప్రధాని మోదీ నిర్ణయం విశాల దృక్పథంతో కూడిన సహేతుకమైనదని గోయెల్ పేర్కొన్నారు.