బిజినెస్

టెలికాం సంస్థల అధికార ప్రతినిధులతో ట్రాయ్ చైర్మన్ శర్మ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ బుధవారం టెలికాం రంగానికి చెందిన వివిధ కంపెనీల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. టెలికాం రంగంలో కల్లోలం నెలకొన్న క్రమంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. వొడాఫోన్ ఐడియా నుంచి ఆ సంస్థ సీఈవో ఈ సమావేశానికి హాజరయ్యారు. 2020లో ట్రాయ్ చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రాధాన్యతను నిర్ణయించడమే ఈ సమావేశ లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. ఒకవైపు కాల్‌డేటా చార్జీల ధరల వివాదం కొనసాగుతుండగా, సుప్రీం తీర్పుతో సర్దుబాటు చేసిన స్థూల ఆదాయానికి సరికొత్త భాష్యం వచ్చిన క్రమంలో ఈ అంశాలే సమావేశంలో కీలకంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. తమ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ టెలికాం సంస్థల అధికార ప్రతినిధులు ఏకరవుపెట్టారు. ప్రధానంగా టెలికాం పరిశ్రమకు చెందిన ఇక్కట్లను వినేందుకు ట్రాయ్ పరిధిలో ఓ సంప్రదింపుల విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నది వివిధ టెలికాం కంపెనీల వాదన. ఇప్పటికే పీకల్లోతు రుణ బాధల్లో, తీవ్ర నష్టాల్లో చిక్కుకున్న టెలికాం రంగం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిందని, సుప్రీం కోర్టు గత నెలలో ఇచ్చిన రూలింగ్ క్రమంలో రూ. 1.47 లక్షల కోట్ల చట్టబద్ధమైన బకాయిల చెల్లింపుకోసం వత్తిడి పెరిగిందని సమావేశంలో టెలికాం సంస్ధలు ఆవేదన వ్యక్తం చేశాయి. మోతాదుకు మించి బకాయిలు ఉన్నందున ప్రభుత్వం సైతం ఆర్థిక చేయూతనిచ్చే వీలు లేనందున ఇప్పటికే వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ తదితర సంస్థలు సామూహిత చట్టబద్ధ బకాయిల చెల్లింపును ఆరంభించాయి. పైగా టెలికాం కంపెనీలు నిర్వహించే ఇతర వ్యాపారాలకు వార్షిక సర్దుబాటు స్ధూల ఆదాయం (ఏజీఆర్) బేరీజు వేసుకుని ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందించరాదంటూ సుప్రీం కోర్టు ఆదేశించడం జరిగింది. అంటే లైసెన్స్, స్పక్ట్రం ఫీజుల్లో ప్రభుత్వ వాటా ఉండదు. ఈక్రమంలో చట్టబద్ధ బకాయిలు తడిసిమోపెడయ్యాయి. ఇలావుండగా వచ్చే ఏడాది అనుసరించాల్సిన ప్రాధాన్యతలపై చర్చించిన ఈ సమావేశంలో టెలికాం సంస్థలు అనేక విషయాలు తమ దృష్టికి తెచ్చాయని ట్రాయ్ చైర్మన్ శర్మ పీటిఐకి తెలిపారు. వీటిపై లిఖిత పూర్వకంగా తెలియజేయాల్సిందిగా సంబంధిత కంపెనీలకు సూచించామన్నారు. వీటిలో వచ్చే ఏడాది ట్రాయ్ చర్యలు తీసుకోవాల్సిన ప్రధానమైన 6 లేదా 7 అంశాలను నిర్ణయిస్టామన్నారు. అయితే సమావేశంలో చర్చకు వచ్చిన కొన్ని కీలక అంశాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.