బిజినెస్

తాజా గరిష్ట స్థాయి లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం తాజా ముగింపు గరిష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతతో బ్యాంకింగ్, ఐటీ, వాహన స్టాక్స్‌లో విదేశీ మదుపర్లు పెద్దయెత్తున వాటాలు కొనుగోళ్లు చేయడంతో మళ్లీ లాభాల ర్యాలీని అందుకున్నాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 199.31 పాయింట్లు (0.49 శాతం) ఎగబాకి సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి 41,020.61 పాయింట్ల ఎగువన స్థిరపడింది. దాదాపు 24 కంపెనీలు ఈ ప్యాక్‌లో లాభపడ్డాయి. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 63 పాయింట్లు (0.52 శాతం) లాభపడి సరికొత్త గరిష్ట స్థాయి 12,100.70 పాయింట్ల ఎగువన స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో యెస్ బ్యాంక్ అత్యధికంగా 7.65 శాతం లాభపడింది. అలాగే ఎస్‌బీఐ 2.43 శాతం, మారుతి 2.38 శాతం, సన్‌పార్మా 1.87 శాతం, హెచ్‌యూఎల్ 1.78 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఎల్ అండ్ టీ అత్యధికంగా 2.05 శాతం నష్టాలపాలైంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, టాటాస్టీల్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ సైతం నష్టాల బాట పట్టాయి. కాగా అంతర్జాతీయంగా మార్కెట్లలో సానుకూలత దృష్ట్యా విదేశీ మదుపర్లు పెద్దమొత్తాల్లో వాటాలు కొనుగోలు చేయడం దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసివచ్చింది. స్టాక్ ఎక్చేంజ్ నుంచి ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు కేవలం మంగళవారం నాడు ఒక్క రోజులోనే ఇలా రూ. 4,677.75 కోట్ల విదేశీ పెట్టుబడులు సమకూరాయి. త్వరలో నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగిసిపోతుండడం సైతం దేశీయ మార్కెట్ల లాభాల ర్యాలీకి ఊతమిచ్చిందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు.
లాభాల్లో ఆసియా మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతతో బుధవారం మెరిజారిటీ శాతం ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాల్లో ముగియగా, షాంఘై మాత్రం నష్టాలను నమోదు చేసింది. ఐరోపా స్టాక్ మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలను నమోదు చేశాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తాజాగా మరోమారు 15 పైసలు బలపడి ఇంట్రాడేలో 71.35గా ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధర 0.18 శాతం వృద్ధితో బ్యారెల్ 63.33 డాలర్ల వంతున ట్రేడైంది.