బిజినెస్

రెండ్రోజుల్లో రూ. 1.87 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు రోజులు రికార్డు స్థాయి గరిష్ట లాభాలను నమోదు చేసిన క్రమంలో మదుపర్ల సంపద ఈ వ్యవధిలో 1.87 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈ జాబితాలోని కంపెనీల మార్కెట్ విలువ రూ. 1,87,370.56 కోట్లు అదనంగా పెరిగి మొత్తం విలువ రూ. 1,55,57,484.15 కోట్ల రూపాయలకు ఎగబాకింది. సెనె్సక్స్ ఈ రెండు రోజుల్లో రికార్డు స్థాయి ముగింపు గరిష్టాలను నమోదు చేసి మొత్తం 308.87 పాయింట్లు అదనంగా లాభపడింది. గురువారం ఈ సూచీ 41,163.79 పాయింట్ల మార్కువద్ద స్థిరపడింది. అలాగే బీఎస్‌ఈలో రూ. 10లక్షల కోట్లకంటే అదనంగా మార్కెట్ విలువను సంతరించుకున్న తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డుకెక్కింది. ఈ కంపెనీ మొత్తం మార్కెట్ విలువ గురువారం రూ. 10,01,555.42 కోట్లుకు చేరింది. రెండో త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు అంచనాలు అధికారికంగా వెలువడనున్న క్రమంలో మదుపర్లు సానుకూలంగా స్పందించారని, అలాగే అంతర్జాతీయంగా ద్రవ్య లభ్యత పెరగడం సైతం సానుకూలంగా మారిందని విశే్లషకులు చెబుతున్నారు. చమురు ధరలు తగ్గడం, ఉత్పత్తిలో సైతం తరుగుదల నెలకొనడం, రూపాయి విలువ తగ్గడం వంటి కారణాలను బేరీజు వేసుకుని చూస్తే దేశ ఆర్థిక అసమతుల్యం తొలగే వరకూ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) తన ద్రవ్య వినిమయ విధానాన్ని మరింత సరళతరం చేసే ప్రక్రియను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ పేర్కొన్నారు. కాగా గురువారం 30 షేర్ల సెనె్సక్స్ ప్యాక్‌లో 17 కంపెనెలు లాభాలను సంతరించుకున్నాయి. అలాగే బీఎస్‌ఈలో 1,283 కంపెనీలు లాభపడగా, 1,201 కంపెనీలు నష్టాలపాలయ్యాయి. 196 స్తబ్థుగా మిగిలాయి. అలాగే బ్రాడర్ మార్కెట్లో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీలు 0.97 శాతం, స్మాల్‌క్యాప్ సూచీలు 0.45 శాతం లాభపడ్డాయి.