బిజినెస్

వరుసగా రెండోరోజూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 28: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండోరోజైన గురువారం సైతం తాజా ముగింపు గరిష్టాలను నమోదు చేశాయి. హెవీవెయిట్స్ సూచీలతోబాటు, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) భారీ లాభాలను సంతరించుకున్నాయి. 10 లక్షల కోట్ల మార్కెట్ విలువను దాటిన తొలి కంపెనీగా ఆర్‌ఐఎల్ రికార్డు సృష్టించింది. కాగా బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఆరంభం నుంచే లాభాల పరుగును అందుకుని ఇంట్రాడేలో 41,163.79 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరిగా 109.56 పాయింట్లు (0.27 శాతం) లాభపడి 41,130.17 పాయింట్ల తాజా ముగింపు గరిష్ట స్థా యిలో స్థిరపడింది. అలాగే నిఫ్టీ సైతం 50.45 పా యింట్లు (0.42 శాతం) అదనంగా లాభపడి రికార్డు స్థాయి గరిష్టం 12,151.15 పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.65 శాతం అదనపు లాభాలతో రూ. 10 లక్షల కోట్లను దాటిన మార్కెట్ విలువను సంతరించుకున్న తొలి కంపెనీగా రికార్డు సృష్టించింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ సెనె్సక్స్ ప్యాక్‌లో అత్యధికంగా 2.68 శాతం లాభాలతో అగ్రభాగాన నిలిచింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ 2.66 శాతం వంతున లాభపడ్డాయి. అలా గే యెస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ సైతం లాభాల బాటపట్టాయి. మరోవైపు హీరోమోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, మారుతి నష్టాలను సంతరించుకున్నాయి. స్థిరంగా వస్తున్న విదేశీ పెట్టుబడులు, నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో సూచీల లాభాల ర్యా లీ కొనసాగిందని వాణిజ్య రంగ విశే్లషకులు అంచనా వేస్తున్నారు.
నష్టాల్లో ఆసియా మార్కెట్లు
హాంగ్‌కాంగ్‌లో ఆందోళన చేస్తున్న ప్రజాస్వామిక వాదులకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా ‘తాము సైతం అమెరికా చర్యలకు ప్రతిచర్యలు చేపట్టాల్సి ఉంటుంద‘ని హెచ్చరించడంతో గురువారం ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. హాంగ్‌కాంగ్, టోక్యో, కోస్పి, సియోల్ స్టాక్ మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. అలాగే ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలనే నమోదు చేశాయి.
క్షీణించిన రూపాయి విలువ
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మా రకం విలువ గురువారం 30 పైసలు క్షీణించింది. ఇంట్రాడేలో 71.65గా ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.62 శాతం తగ్గుదలతో బ్యారెల్ 62.62 డాలర్ల వంతున ట్రేడైంది.
అఫ్గాన్‌పై భారత్ అండర్ -19 విజయం
లక్నో, నవంబర్ 28: అప్గానిస్తాన్ అండర్ -19 జట్టుతో జరిగిన నాలుగో యూత్ వనే్డలో భారత్ జట్టు 5 వికెట్ల తేడా తో విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ జట్టు 35 ఓవర్లలో 113 పరుగులకే ఆ లౌటయ్యారు. ఇమ్రాన్ మిర్ (44), కెప్టెన్ ఫర్హాన్ జకీల్ (23), రహ్మాన్‌వుల్లా 915) మాత్రమే రెండంకెల స్కోరును చేశారు. భారత అయతే మిగతా బ్యాట్స్‌మెన్ల కంటే ఎక్స్ ట్రా పరుగులే అధికం కావడం విశేషం. భారత బౌలర్లలో మనవ్ సుతార్ 5 వికెట్లు తీయగా, విద్యాధర్ పాటిల్, కెప్టెన్ శుభాంగ్ హెజ్డే రెండేసి వికెట్లు, రిషభ్ భన్సల్ 1 వికెట్ తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 28.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయ విజయం సాధించింది.