బిజినెస్

విదేశీ వాణిజ్యానికి కేంద్రం ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 28: విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నిర్యత్ బంధు’ పథకం మంచి ఫలితాలిస్తోందని విదేశీ వాణిజ్యం డైరెక్టరేట్ కార్యాలయం సంయుక్త సంచాలకులు బీఎన్ రమేష్ తెలిపారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ వాణిజ్య విభాగంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. నిర్దేశిత వాణిజ్య లక్ష్యాలను సాధించే వారికి స్టార్ ఎగుమతిదారుగా గుర్తిస్తూ ఎగుమతుల్లో కొన్ని మినహాయింపులు ఇస్తున్నట్టు వెల్లడించారు.
ఎగుమతి దారుడికి తమ ఉత్పత్తి పేరుతో పాటు ఐటసీ హెచ్‌ఎస్ కోడ్ కేటాయిస్తున్నామని, తద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యక ఆర్థిక మండలి ఏపీఎస్‌ఈజెడ్ డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ వీకేకే నడింపల్లి మాట్లాడుతూ దేశంలో ఏర్పాటయిన 416 ప్రత్యేక ఆర్థిక మండళ్ల ద్వారా 5,109 పారిశ్రామిక యూనిట్లు పనిచేస్తున్నాయన్నారు. వీటి ద్వారా 22 లక్షల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. గడచిన ఆరు నెలల్లో రూ.3.81 లక్షల కోట్ల మేర ఎగుమతులు ప్రత్యేక ఆర్థిక మండళ్ల ద్వారానే జరుగుతున్నాయన్నారు. విశాఖ ప్రత్యేక ఆర్థిక మండలిలో 14 యూనిట్లు పనిచేస్తున్నాయన్నారు.
ప్రత్యేక ఆర్థిక మండళ్లలో యూనిట్లు నెలకొల్పేవారికి సింగిల్ విండో పథకం కింద అన్ని క్లియరెన్స్‌లు లభిస్తాయన్నారు. ప్రత్యేక చట్టాల ద్వారా రక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో గీతం అంతర్జాతీయ ప్రాజెక్టు వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీ లలిత పాల్గొన్నారు.

*చిత్రాలు.. సదస్సులో మాట్లాడుతున్న డీజీఎఫ్‌టీ జేడీ రమేష్